ETV Bharat / bharat

Azadi Ka Amrit Mahotsav: చిదంబరం దెబ్బకు.. దిగొచ్చిన బ్రిటిష్​ కంపెనీ - బ్రిటిష్​ పాలన

Azadi Ka Amrit Mahotsav: స్వదేశీ ఉత్పత్తులంటే అగ్గిపెట్టెలు, సబ్బుల తయారీగా సాగుతున్న వేళ... ఏకంగా ఓ స్టీమ్‌ నావిగేషన్‌ కంపెనీని ఏర్పాటు చేయటం మాటలు కాదు. అదీ బ్రిటిష్‌ కంపెనీకి పోటీగా! ఆ సాహసమే చేసిచూపి అటు ఆంగ్లేయులను దెబ్బతీసి... ఇటు భారతీయుల్లో ఆత్మనిర్భరతను పెంచారు వి.ఓ.చిదంబరం పిళ్లై. ఈ క్రమంలో జైలుపాలై తన సర్వస్వాన్నీ కోల్పోయారు. భారత స్వాతంత్య్రం కోసం నిబద్ధతతో పోరాడిన అరుదైన అమరుడు చిదంబరం పిళ్లై.

VO Chidambaram Pillai
చిదంబరం పిళ్లై
author img

By

Published : Feb 9, 2022, 8:28 AM IST

Azadi Ka Amrit Mahotsav: బ్రిటిష్‌ స్టీమ్‌ నావిగేషన్‌ కంపెనీ (బీఐఎస్‌ఎన్‌సీ)... 1856లో ఆంగ్లేయులు ఏర్పాటు చేసిన ఓ ప్రైవేటు నౌకాయాన సంస్థ. తొలుత ఉత్తరాలు, పార్శిళ్లకు పరిమితమై తర్వాతి కాలంలో ప్రజా రవాణాతోపాటు చైనాతో తేయాకు, నల్లమందు వ్యాపారం కూడా మొదలెట్టారు. బ్రిటిష్‌ సర్కారుతో బంధం బాగా కుదిరింది. ఏకఛత్రాధిపత్యం చలాయిస్తున్న ఈ కంపెనీకి సముద్రజలాల్లో తిరుగులేకుండా పోయింది. భారతీయ ప్రయాణికులను, వ్యాపారులను వేధించి వివక్ష చూపేవారు. విచక్షణ రహితంగా ఓడల్లో ప్రయాణ ధరలను పెంచారు. భారతీయులు ఎక్కితే నీచంగా చూసేవారు. ఆంగ్లేయుల ఈ అరాచక సంస్కృతిపై తిరగబడాలని తమిళనాడు తూత్తుకుడి వ్యాపారులు నిర్ణయించుకున్నారు. వీరందరికీ నాయకత్వం వహించారు వీఓ చిదంబరం పిళ్లై.

తూత్తుకుడికి సమీప గ్రామంలో 1872లో ఓ సంపన్న కుటుంబంలో జన్మించిన వల్లినాయగన్‌ ఒలగనాథన్‌ చిదంబరం పిళ్లై లా చదివారు. 1905లో జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. 1907లో కాంగ్రెస్‌ పార్టీలో అతివాద-మితవాద చీలిక సంభవించింది. అతివాదులకు నాయకత్వం వహిస్తున్న బాలగంగాధర్‌ తిలక్‌ మద్రాసు రాష్ట్రంలో తన అనుయాయిగా చిదంబరం పిళ్లైని ఎంచుకున్నారు. అలాంటి పిళ్లై సారథ్యంలో స్వదేశీ ఉద్యమం ఊపందుకుంది. ఆ తరుణంలోనే బీఐఎస్‌ఎన్‌సీ వ్యవహారం తెరపైకి వచ్చింది. దీంతో భారతీయులకు స్వయంగా నౌకాయాన కంపెనీ పెట్టే సామర్థ్యం ఉందని నిరూపిస్తూ... 1906లో స్వదేశీ స్టీమ్‌ నావిగేషన్‌ కంపెనీ (ఎస్‌ఎస్‌ఎన్‌సీ)ని రిజిస్టర్‌ చేయించారు పిళ్లై. తూత్తుకుడి వ్యాపార వేత్తలు, పలువురు జమీందారుల నుంచి సేకరించిన రూ.10 లక్షల పెట్టుబడితో దీన్ని స్థాపించారు. మొదట్లో షాలైన్‌ స్టీమర్లను లీజుకు తీసుకొని నడిపించారు. షాలైన్‌పై బ్రిటిష్‌ కంపెనీ ఒత్తిడి తెచ్చి లీజ్‌ను రద్దు చేయించింది. దీంతో... సొంతగా ఓడలు కొనాలని నిర్ణయించుకున్నారు పిళ్లై. దేశవ్యాప్తంగా తిరిగి పెట్టుబడులు సమీకరించారు. ఫ్రాన్స్‌ నుంచి రెండు ఓడలు కొన్నారు. వీటిని తూత్తుకుడి కొలంబో మధ్య నడిపేవారు.

చిదంబరం దెబ్బకు.. బ్రిటిష్‌ కంపెనీ తక్షణమే తమ ఓడల్లో ప్రయాణ టికెట్‌ ధరలు తగ్గించింది. ప్రయాణికులు రాకపోవటంతో... చిదంబరం ఓడను ఎదుర్కోవటానికి బ్రిటిష్‌ కంపెనీ ఏకంగా... తమ ఓడలో ప్రయాణం చేసే వారికి ఉచితంగా గొడుగులిస్తామని ప్రకటించింది. అయినా బ్రిటిష్‌ ఓడకంటే... స్వదేశీ ఓడకే ప్రజలు ప్రాధాన్యం ఇచ్చేవారు. తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్న చిదంబరం పిళ్లైని ఎలాగైనా కట్టడి చేయాలని ఆంగ్లేయులు నిర్ణయించుకున్నారు.

తూత్తుకుడి కోరల్‌ మిల్‌ కార్మికుల సమ్మె వారికి మంచి అవకాశంగా లభించింది. కార్మికుల వేతనాలు పెంచాలంటూ సమ్మె జరిగింది. వారి తరఫున పిళ్లై నిలబడ్డారు. యాజమాన్యం దిగివచ్చింది. ఈ స్ఫూర్తితో ఇతర యూరోపియన్‌ యాజమాన్య కంపెనీల్లోనూ సమ్మెలు మొదలయ్యాయి. అల్లర్లకు కారణమవుతున్నాడనే నెపంతో 1908లో ఓ రోజు చిదంబరాన్ని అరెస్టు చేశారు. ఈ విషయం తెలియగానే ప్రజలు తిరగబడ్డారు. పోలీసు కాల్పుల్లో నలుగురు చనిపోయారు. ప్రభుత్వం చిదంబరం పిళ్లైపై రాజద్రోహ నేరం మోపింది. విచారణానంతరం ఆయనకు 40 సంవత్సరాల యావజ్జీవ కారాగారశిక్ష విధించారు. హైకోర్టులో శిక్షను నాలుగేళ్లకు తగ్గించి, మరో ఆరేళ్లు తూత్తుకుడి… బయట ఉండాలని ఉపశమనం కల్పించారు. జైల్లో ఆయనను గానుగకు పశువులా కట్టి పనిచేయించారు. 1912 డిసెంబరులో విడుదలయ్యే సమయానికి పిళ్లై ఆరోగ్యం దెబ్బతింది. అప్పటికే ఆయన స్థాపించిన స్టీమ్‌ నావిగేషన్‌ కంపెనీని దివాళా తీయించి... ఓడలను వేలం వేశారు. వాటిని పోటీ బ్రిటిష్‌ కంపెనీయే కొనేసింది.

బయటకు వచ్చాక తిలక్‌ శిష్యుడు అనే కారణంతో కాంగ్రెస్‌ పిళ్లైని అంతగా పట్టించుకోలేదు. చెన్నైలో కిరోసిన్‌ అమ్ముకుంటూ బతికారాయన. పేదరికంతో అల్లాడి చివరి రోజుల్లో మళ్లీ తూత్తుకుడి చేరుకున్నారు. 1936 నవంబరు 18న కాంగ్రెస్‌ కార్యాలయంలోనే తుది శ్వాస విడిచారు. అదే ఆయన చివరి కోరిక కూడా కావడం గమనార్హం.

ఇదీ చూడండి: Azadi Ka Amrit Mahotsav: బ్రిటిష్‌ హిట్లరిజం..70 మంది రైతులను చంపిన వైనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.