ETV Bharat / bharat

గాంధీ- ఇర్విన్​ ఒప్పందం.. తొలిసారి సమ ఉజ్జీలుగా చర్చలు

AZADI KA AMRIT MAHOTSAV: ఆది నుంచీ భారత్‌ను, భారతీయులను చిన్నచూపు చూస్తూ, నిమ్నంగా భావిస్తూ వచ్చిన ఆంగ్లేయ సర్కారు 1931లో తొలిసారి సరి సమాన పీఠం వేసింది. గాంధీ-ఇర్విన్‌ ఒప్పందం అందుకు వేదికైంది. సమ ఉజ్జీలుగా ఇద్దరి మధ్యా చర్చలు జరిగాయి. ఈ ఒప్పందంపై ఇటు కాంగ్రెస్‌లో.. అటు బ్రిటిష్‌ సర్కారులో అసంతృప్తి వ్యక్తమవటం గమనార్హం.

AZADI KA AMRIT MAHOTSAV
AZADI KA AMRIT MAHOTSAV
author img

By

Published : Mar 5, 2022, 7:51 AM IST

AZADI KA AMRIT MAHOTSAV: 1929 చివర్లో మరో మహా సత్యాగ్రహ ఉద్యమం అంటూ గాంధీజీ సంకేతాలు పంపుతున్న దశలో.. ఇంగ్లాండ్‌ పర్యటన నుంచి వచ్చిన వైస్రాయ్‌ లార్డ్‌ ఇర్విన్‌ అక్టోబరు 25న కీలక ప్రకటన చేశాడు. 'భారత్‌కు స్వయం ప్రతిపత్తి ఇవ్వటమే బ్రిటిష్‌ విధాన లక్ష్యం. త్వరలో లండన్‌లో జరిగే రౌండ్‌టేబుల్‌ కాన్ఫరెన్స్‌లో దీని భవిష్యత్‌పై చర్చిస్తారు' అని వెల్లడించిన ఇర్విన్‌... తమ సర్కారు అనుమతితోనే తానీ ప్రకటన చేసినట్లు స్పష్టం చేశారు. దీంతో యావత్‌ భారతావని సంబరాల్లో మునిగిపోయింది. గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్‌ కూడా స్వాగతిస్తూనే.. ఆచితూచి స్పందించింది. రౌండ్‌టేబుల్‌ కాన్ఫరెన్స్‌లో చర్చకు స్వయంప్రతిపత్తి హోదానే ప్రధాన భూమిక కావాలని, ఈలోపే భారత్‌లోని ఆంగ్లేయ ప్రభుత్వం స్వయం ప్రతిపత్తిగల ప్రభుత్వంగా వ్యవహరించాలని, రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. కానీ వైస్రాయ్‌ కార్యాలయం వాటన్నింటినీ తిరస్కరించింది. డిసెంబరు 23న ఇర్విన్‌ ఓ సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌ తరఫున గాంధీజీ, మోతీలాల్‌ నెహ్రూ, తేజ్‌ బహదూర్‌, జిన్నా, విఠల్‌భాయ్‌ (వల్లభ్‌భాయ్‌ పటేల్‌ సోదరుడు) హాజరయ్యారు. రౌండ్‌టేబుల్‌ సమావేశానికి ముందే స్వయం ప్రతిపత్తిపై తానెలాంటి హామీ ఇవ్వలేనని వైస్రాయ్‌ ఇర్విన్‌ ఈ భేటీలో తన అశక్తతను వ్యక్తంజేశారు. ముందస్తు హామీకి కాంగ్రెస్‌ పట్టుబట్టడాన్ని జిన్నా ఈ సమావేశంలో వ్యతిరేకించటం గమనార్హం. దీంతో ఉద్యమాన్ని కొనసాగించాలని గాంధీ నిర్ణయించారు. 1929 డిసెంబరులో లాహోర్‌లో జరిగిన కాంగ్రెస్‌ సదస్సులో సంపూర్ణ స్వరాజ్యం మా లక్ష్యం అంటూ నినదించారు.

Irwin
ఇర్విన్​

1930 మార్చిలో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రకటించారు. దాన్ని బ్రిటిష్‌ సర్కారు తొలుత హేళన చేసింది. కానీ వారి అంచనాలను మించి ఆ ఉద్యమం విజయవంతమైంది. గాంధీని అరెస్టు చేశారు. వైస్రాయ్‌గా తన పదవీకాలం ముగుస్తున్న వేళ ఇర్విన్‌ ఉద్యమాన్ని ఆపించాలని చూశారు. గాంధీజీతో ఒప్పందానికి సిద్ధమయ్యారు. కానీ గాంధీజీ వేగిరపడలేదు. 1931 జనవరి 26న ఆయన్ను ఆంగ్లేయ సర్కారు విడుదల చేసింది. అయినా ఉద్యమాన్ని రద్దు చేయకుండానే.. ఇర్విన్‌తో భేటీ జరపాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది.

ప్రతిసారీ ఆంగ్లేయులు కోరుకున్నరీతిలో జరిగినట్లుగా కాకుండా.. తొలిసారి భారత్‌, బ్రిటన్‌లు సరిసమాన హోదాలో కూర్చొని చర్చించుకోవటం ఈ చర్చల ప్రాధాన్యం. పైగా భారత్‌ కోరితే జరిగిన చర్చలు కావు. బ్రిటిష్‌ వైస్రాయ్‌ స్వయంగా ఆహ్వానించి చేసుకున్న ఒప్పందం. కానీ జవహర్‌లాల్‌ నెహ్రూతో పాటు కాంగ్రెస్‌లో అనేకమంది ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించారు. కరాచీ కాంగ్రెస్‌ సదస్సులో వాడీవేడీ చర్చ జరిగాక ఈ ఒప్పందం జాతీయ కాంగ్రెస్‌ ప్రతిష్ఠను పెంచిందని నెహ్రూ సహా అంతా అంగీకరించారు. మరోవైపు.. భారత డిమాండ్లను అంగీకరించటం బ్రిటిష్‌ బ్యూరోక్రసీకి నచ్చలేదు. ఇర్విన్‌ తర్వాత వైస్రాయ్‌గా నియమితుడైన లార్డ్‌ విల్లింగ్డన్‌ వారికి తోడయ్యాడు. ఇర్విన్‌ ఒప్పందానికి తూట్లు పొడవటం ఆరంభమైంది.

గాంధీజీ-ఇర్విన్‌లు 1931 ఫిబ్రవరి 27న తొలిసారి సమావేశమయ్యారు. పలు దఫాల చర్చల తర్వాత మార్చి 5న ఇద్దరూ ఒప్పందంపై సంతకం చేశారు. ఉద్యమ సందర్భంగా ప్రభుత్వ దమనకాండపై విచారణకు ఆదేశించేలా ఇర్విన్‌ను ఒప్పించాలని కాంగ్రెస్‌ భావించింది. కానీ అలా చేస్తే తన పరువు పోతుందంటూ.. ఇర్విన్‌ విజ్ఞప్తి చేయటంతో గాంధీజీ పట్టుబట్టకుండా వదిలేశారు. బదులుగా తీరప్రాంతాల్లోని వారు ఎలాంటి పన్ను లేకుండా ఉప్పు తయారు చేసుకోవటానికి, శాంతియుత ధర్నాలకు, రాజకీయ ఖైదీలను విడుదల చేయటానికి, స్వాధీనం చేసుకున్న వారి ఆస్తులను తిరిగి ఇవ్వటానికీ ఇర్విన్‌ అంగీకరించారు. స్వయంప్రతిపత్తిగల దేశంలో ఫెడరల్‌ వ్యవస్థ ఉండాలని అంగీకరించారు. ఆంగ్లేయ సర్కారు ప్రయోజనాల కోసం కాకుండా భారత ప్రజల ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని ఒప్పందంలో చేర్చారు. కాంగ్రెస్‌ పూర్ణ స్వరాజ్యాన్ని డిమాండ్‌ చేయటానికి కూడా ఇర్విన్‌ అభ్యంతరం తెలపలేదు.

ఇదీ చూడండి: 'లార్డ్​ మేయో హత్య.. బయటకు తెలిస్తే పరువు పోతుందని!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.