ETV Bharat / bharat

ఒకే రోజు 356 మందిని ఊచకోత కోసిన ఆంగ్లేయులు!

Azadi Ka Amrit Mahotsav: తొంగి చూస్తే బ్రిటిష్‌ హయాంలో చరిత్రకెక్కని జలియన్‌వాలాబాగ్‌లెన్నో! మధ్యప్రదేశ్‌ సెహోర్‌ తిరుగుబాటు అలాంటిదే. స్థానిక రాణి బేగంపైనా, బ్రిటిష్‌ సర్కారుపైనా తిరుగుబాటు జెండా ఎగరేసి... ఐదునెలల పాటు హిందూ-ముస్లిం ఐక్య ప్రభుత్వాన్ని నడిపిన వారిని అత్యంత దారుణంగా అణచివేశారు. ఒకేరోజు 356 మందిని ఆంగ్లేయులు ఊచకోత కోశారు.

Azadi Ka Amrit Mahotsav
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
author img

By

Published : Mar 3, 2022, 8:11 AM IST

Azadi Ka Amrit Mahotsav: భోపాల్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ సెహోర్‌. ఆంగ్లేయుల కనుసన్నల్లో భోపాల్‌ సంస్థానం నవాబు సికిందర్‌ జహన్‌ బేగం పాలనలో ఉండేది. నవాబు సైన్యంతో పాటు ఆంగ్లేయుల సైన్యం కూడా అక్కడే ఉండేది. రెండింటిలోనూ భారతీయులే సిపాయిలు. మేరఠ్‌, ఝాన్సీ తదితర ప్రాంతాల్లో మొదలైన 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ప్రభావం సెహోర్‌పై కాస్త ఆలస్యంగా పడింది. మేరఠ్‌, ఇండోర్‌ల నుంచి తిరుగుబాటు పోస్టర్లు సెహోర్‌ దళంలో కదలిక తెచ్చాయి. ఒకరిద్దరు నోరెత్తినా ఆంగ్లేయులు వారిని ఆదిలోనే అణచివేశారు. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. 1857 జులైలో హోల్కర్‌ సంస్థాన సైన్యం... ఇండోర్‌లోని బ్రిటిష్‌ కంటోన్మెంట్‌పై దాడి చేసింది. ఆంగ్లేయుల రాజకీయ ప్రతినిధి హెన్రీ మరియన్‌ డ్యూరాండ్‌ పారిపోయి... సెహోర్‌ చేరుకున్నాడు. మిగిలిన చోట్ల ఆంగ్లేయులను తరుముతుంటే... తాము వారికి రక్షణగా నిలవటమేంటని సిపాయిల్లో ఆలోచన మొదలైంది. ఇండోర్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్న 14 మంది భోపాల్‌ సిపాయిలు తిరుగుబాటు చేసి రావటంతో సెహోర్‌ సిపాయిల్లోనూ ధైర్యం వచ్చింది. దీంతో ఆంగ్లేయ అధికారులు అక్కడి నుంచీ పరారయ్యారు

ఆగ్రహించిన భోపాల్‌ బేగం... తిరుగుబాటుదారులను గుర్తించాల్సిందిగా తన అనుచరులను పంపించింది. ఈ చర్య సిపాయిలను మరింత రెచ్చగొట్టింది. ఇంతలో తిరుగుబాటును ప్రోత్సహిస్తున్నారంటూ హవల్దార్‌ మహవీర్‌, సుబేదార్‌ రామ్‌జులాల్‌, రిసాల్దార్‌ వలీషా, ఆరిఫ్‌లను సైన్యం నుంచి బహిష్కరించటమేగాకుండా అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇది అగ్నికి ఆజ్యం పోసింది. వలీషా, మహవీర్‌ల నాయకత్వంలో సెహోర్‌ దళం తిరుగుబాటు జెండా ఎగరేసింది. భోపాల్‌ బేగం ఆంగ్లేయులకు వత్తాసు పలుకుతుండటంతో వీరంతా అటు బేగంపైనా, ఇటు ఆంగ్లేయ సర్కారుపైనా తిరుగుబాటు చేసి ‘సిపాయి బహదూర్‌ సర్కార్‌’ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అధికారిక కార్యాలయాల నుంచి బ్రిటిష్‌ జెండాను దించేశారు. హిందూ, ముస్లింల ఐక్య ప్రభుత్వానికి చిహ్నంగా మహవీర్‌ నిషాన్‌, నిషాన్‌-ఇ-మహమ్మది జెండాలు ఎగరేశారు. ఆగస్టుకల్లా మహవీర్‌, వలీ షాల సారథ్యంలో పరిపాలన మండలితో పాటు రెండు న్యాయస్థానాలు (క్రిమినల్‌, సివిల్‌) కూడా ఏర్పడ్డాయి. దాదాపు ఐదునెలల పాటు హిందు-ముస్లిం ఐక్య సర్కారు నిరాటంకంగా పాలన సాగించింది.

బయటి నుంచి ఝాన్సీలక్ష్మీబాయి ఇతర తిరుగుబాటు వీరులు కూడా వీరికి మద్దతు ప్రకటించారు. ఆంగ్లేయుల పక్షం వీడాల్సిందిగా భోపాల్‌ బేగంకు లక్ష్మీబాయి మూడుసార్లు లేఖలు రాశారు. కానీ బేగం తీరుమారలేదు. సిపాయి బహదూర్‌ సర్కార్‌ను మట్టుబెట్టడానికి అన్ని ప్రయత్నాలూ చేశారు. ఆంగ్లేయుల సాయం కోరుతూ వచ్చారు. 1858 జనవరిలో జనరల్‌ హ్యూ రోస్‌ సారథ్యంలో ఆంగ్లేయ సైన్యం భోపాల్‌ చేరుకుంది. తమ అధునాతన ఆయుధాలకు... బేగం అనుచరుల వంచన కూడా తోడవటంతో... ‘సిపాయి బహదూర్‌ సర్కార్‌’ను అణచివేయటం ఆంగ్లేయులకు సులభమైంది. జనవరి 14న 356 మంది తిరుగుబాటు సిపాయిలను సెహోర్‌లో హ్యూ రోస్‌ సైన్యం అత్యంత అమానుషంగా విచారణ కూడా లేకుండా చంపేసింది. 149 మందినైతే వరుసగా నిలబెట్టి కాల్చేశారు. తిరుగుబాటు సర్కారు ఏర్పాటులో కీలకమైన మహవీర్‌ను కొద్దిరోజుల తర్వాత పట్టుకొని ఉరితీశారు. వలీ షా దొరకలేదు. మౌనంగా రోదించటం తప్ప సెహోర్‌ చేయగలిగిందేమీ లేకపోయింది. చివరకు చరిత్రలోనూ ఈ సంఘటన మరుగున పడిపోయింది.

ఇదీ చదవండి: భర్తను వదిలి.. విదేశీగడ్డపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన వీరనారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.