ETV Bharat / bharat

ఆంగ్లేయుల దొంగదారులు.. భారత దుస్తులు ధరిస్తే జరిమానాలు!

author img

By

Published : Apr 28, 2022, 7:41 AM IST

AZADI KA AMRIT MAHOTSAV: భారత్‌కు నాగరికత నేర్పడానికి వచ్చామని డాంబికాలు పలికిన ఆంగ్లేయులు.. మనతో నాణ్యతలో పోటీ పడలేక దొంగదారులు తొక్కారు. స్వదేశంలో తమ వ్యాపారులను, పరిశ్రమలను బతికించుకోవడానికి భారత్‌పై ఆంక్షలు మోపారు. ఇండియా నుంచి వచ్చిన వస్త్రాలను కడితే జరిమానా వేస్తామని తమ సొంత దేశస్థులను సైతం బెదిరిస్తూ ఇంగ్లాండ్‌లో ఏకంగా చట్టమే తీసుకొచ్చారు.

azadi ka amrit
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్

AZADI KA AMRIT MAHOTSAV: ఈస్టిండియా కంపెనీ భారత్‌లో అడుగు పెట్టేనాటికే భారత వస్త్రపరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. భారతీయ వస్త్రాల నాణ్యత, మన్నిక, ధరలకు ఐరోపా సహా అన్ని దేశాలూ ఫిదా అయ్యాయి. ప్రపంచ వస్త్ర అవసరాలను 25% దాకా ఒక్క భారతే తీర్చేదంటే మన నేతకారుల ఘనతను అర్థం చేసుకోవచ్చు. విదేశాల్లో తయారయ్యే వాటికంటే తక్కువ ధరకు, నాణ్యమైన దుస్తులను అందంగా తయారు చేయటం భారతీయుల ప్రత్యేకతగా ఉండేది. దీంతో ఈస్టిండియా కంపెనీ సహజంగానే భారత్‌లో తక్కువ ధరలకు లభ్యమవుతున్న ఈ దుస్తులను ముఖ్యంగా కాలికో (ఒకరకమైన పత్తి. కేరళలోని కాలికట్లో తొలుత ఉత్పత్తి అయ్యేది. అందుకే కాలికో అని పేరు వచ్చింది.) రకాన్ని బ్రిటన్‌కు పరిచయం చేసింది. అనతికాలంలోనే ఈ రకం దుస్తులకు బ్రిటన్‌ అంతటా డిమాండ్‌ పెరిగింది. ఈస్టిండియా కంపెనీ భారత్‌తోపాటు ఆసియాలోని ఇతర ప్రాంతాల నుంచీ భారీస్థాయిలో వస్త్రాలను కొని స్వదేశానికి తరలించడం ప్రారంభించింది. ఇది ప్రజలకు సౌకర్యంగానే ఉన్నా.. బ్రిటన్‌లోని ఉలెన్‌, లినెన్‌ వస్త్ర ఉత్పత్తిదారులకు పోటీగా మారింది. ఈ వృత్తిపై ఆధారపడి బతుకుతున్న వారందరినీ జమచేసి.. పారిశ్రామిక వేత్తలు రోడ్లమీదికి వచ్చారు. బ్రిటిష్‌ పార్లమెంటుపై ఒత్తిడి తెచ్చారు. లండన్‌లోని ఈస్టిండియా కంపెనీ కార్యాలయాన్ని ముట్టడించారు. అలా 1680 నుంచి 1730 దాకా అంటే యాభై ఏళ్లపాటు బ్రిటిష్‌ రాజకీయాల్లో భారత్‌ నుంచి వస్త్రాల దిగుమతిని అడ్డుకోవడమే ప్రధానాంశమై కూర్చుంది. ఈ క్రమంలో భారత వస్త్రాలపై 20% సుంకం విధించారు. స్వదేశీ వస్త్ర పరిశ్రమ ఉత్పత్తులు, అమ్మకాలు పడిపోయి.. భారత్‌, చైనాల నుంచి దిగుమతులు పెరగడంతో బ్రిటిష్‌ పార్లమెంటు 1701 సంవత్సరంలో ప్రత్యేకంగా కాలికో చట్టం తీసుకొచ్చింది. బ్రిటన్‌లోకి కాటన్‌, పెయింట్‌, ప్రింటెడ్‌, డై చేసిన వస్త్రాల దిగుమతిని నిషేధించింది.

నిషేధమున్నా ఆగని అమ్మకాలు: దిగుమతులపై నిషేధం కారణంగా డిమాండ్‌ ఇంకా జోరందుకుంది. భారత్‌ నుంచి స్మగ్లింగ్‌ రూపంలో తేవడం ప్రారంభమైంది. వస్త్రాల అమ్మకాలు ఇంకా పెరిగాయి. దిగుమతుల నిషేధ చట్టం మొదటికే మోసం తెచ్చిందని గుర్తించిన బ్రిటన్‌ పార్లమెంటు 1721లో నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ రెండో కాలికో చట్టం తీసుకొచ్చింది. ఈసారి కాటన్‌ వస్త్రాల దిగుమతితోపాటు అమ్మకాలనూ నిషేధించింది. భారత కాటన్‌ దుస్తులు ధరిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. వస్త్ర వ్యాపారంలో బ్రిటన్‌ నిలదొక్కుకున్నాక ఈ చట్టాన్ని తొలగించారు.

అగ్రరాజ్యంగా ఎదిగినా అదే అక్కసు: ఒకవైపు భారత వస్త్రాలపై నిషేధం విధించడం, మరోవైపు అమెరికాలో బానిసలతో తక్కువ ఖర్చుతో పత్తి పండించడం, స్వదేశంలో పారిశ్రామికీకరణ.. అన్నీ కలసి 1800 నాటికి వస్త్ర పరిశ్రమలో బ్రిటన్‌ అగ్రరాజ్యంగా ఎదిగింది. అయినా భారత్‌పై అక్కసును మాత్రం వదలలేదు. భారతీయులపై భారత్‌లోనూ సుంకాలు పెంచారు. తమకు మాత్రమే ముడిసరకు అమ్మేలా ఆంక్షలు విధించారు. 1813లో భారత కాటన్‌ దిగుమతులపై బ్రిటన్‌లో అత్యధికంగా 85% సుంకం విధించారు. భారత ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాల్లో ఒకటైన వస్త్ర పరిశ్రమను దెబ్బతీశారు. అప్పటిదాకా తమ నైపుణ్యంతో పనిచేసుకుంటూ.. తమ కాళ్లపై తాము ధైర్యంగా బతికిన లక్షల మంది భారతీయులు ఆంగ్లేయుల నిర్ణయాల కారణంగా రోడ్డున పడ్డారు. ఏమీ చేయలేక, కూటికి గతి లేక.. వంటవాళ్లుగా, సేవకులుగా మారిపోయారు.

ఇదీ చదవండి: స్వాతంత్య్ర సమరంలోనూ మారుమోగిన 'బజాజ్'​ పేరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.