ETV Bharat / bharat

సిపాయిలపై తెల్లదొరల రాక్షసానందం - ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సిపాయిల తిరుగుబాటు

కోహినూర్లూ... కోట్ల సంపదననే కాదు... పుర్రెలు సైతం బ్రిటన్‌కు తీసుకెళ్లి సంబరపడ్డారు తెల్లవారు! రాక్షసంగా మనుషుల్ని చంపి.. దాన్ని తమ పైచేయికి ప్రతీకగా జబ్బలు చరచుకున్నారు. పుర్రెలను విజయ ట్రోఫీలుగా ప్రదర్శించుకున్నారు. బ్రిటీష్ పాలనలో భారతీయులు ఎలాంటి వివక్షను ఎదుర్కొనేవారో తెలియజేసే ఘటనను ఓసారి చూద్దామా?..

Azadi-Ka-Amrit-Mahotsav
Azadi-Ka-Amrit-Mahotsav
author img

By

Published : Oct 5, 2021, 9:51 AM IST

1857 సిపాయిల తిరుగుబాటు జరిగి 164 సంవత్సరాలు! ఆనాటి తిరుగుబాటులో ప్రాణాలు కోల్పోయిన ఓ సిపాయి పుర్రె మాత్రం బ్రిటన్‌లో తేలింది. బెంగాలీ ఇన్‌ఫాంట్రీకి చెందిన హవల్దార్‌ ఆలం బేగ్‌ సిపాయిల తిరుగుబాటు సందర్భంగా కొంతమంది తెల్లవారిని చంపేశాడు. దీంతో ఆగ్రహోదగ్రులైన తెల్లవారు వెంటాడి వేటాడి ఆలంబేగ్‌ను పట్టుకొని ఫిరంగికి వేలాడదీసి దారుణంగా కాల్చివేశారు. సిపాయిల తిరుగుబాటు అణచివేతకు, తెల్లవారి విజయానికి ప్రతీకగా ఆయన పుర్రెను బ్రిటన్‌కు తీసుకొని వెళ్లారు. ట్రోఫీలా ప్రదర్శనకు పెట్టారు. చివరకు అది బ్రిటన్‌ కెంట్‌ రాష్ట్రంలోని లార్డ్‌ క్లైడ్‌ పబ్‌లో 1963లో బయటపడింది. ఆ పుర్రెతో పాటు దానికి సంబంధించిన వివరాలను కూడా ఓ పేపర్‌పై రాసి అందులో భద్రపరిచారు.

పుర్రె చెప్పిన చరిత్ర..

2014లో అనూహ్యంగా ఈ అంశం తెరపైకి వచ్చింది. చరిత్రకారుడు, భారత్‌లో బ్రిటిష్‌ హయాంపై లండన్‌లోని క్వీన్‌ మేరీ కాలేజీలో బోధించే అధ్యాపకుడు కిమ్‌ వాగ్నర్‌కు పబ్‌కు చెందిన కుటుంబం నుంచి సందేశం వచ్చింది. 'మావద్ద భారత్‌కు చెందిన పురాతనమైన ఓ పుర్రె ఉంది. దాన్ని కాపాడటం కష్టమవుతోంది. మీ పరిశోధనకు ఏమైనా ఉపయోగపడుతుందేమో చూడండి' అన్నది ఆ సందేశ సారాంశం. వాగ్నర్‌ వెళ్లి దాన్ని తీసుకొచ్చుకున్నారు. పుర్రెతో పాటున్న చిట్టీలోని సమాచారంతోపాటు... మరింత పరిశోధన చేసిన వాగ్నర్‌ సమగ్ర సమాచారం సేకరించారు. ఏకంగా ఓ పుస్తకమే రాసేశారు కూడా. వాగ్నర్‌ ప్రకారం... ఆలం బేగ్‌ సిపాయిల తిరుగుబాటు సమయంలో సియాల్‌కోట్‌లో పనిచేసేవాడు. మేరఠ్‌, దిల్లీల్లోలాగా ఇక్కడ జరిగిన తిరుగుబాటు పెద్దగా చరిత్రకెక్కలేదు. సియాల్‌కోట్‌లో తిరుగుబాటు చేసిన సేనలు... దిల్లీవైపుగా దూసుకొచ్చాయి. అయితే వారిని నికోల్సన్‌ సారథ్యంలోని బ్రిటిష్‌ దళం అడ్డుకొని తిప్పికొట్టింది. దీన్ని ట్రిమ్ముఘాట్‌ పోరాటంగా పిలుస్తారు. ఈ పోరులో బతికిన సిపాయిలు.. హిమాలయాలకు పారిపోయారు. అయితే వారిని ఏడాదంతా వెతికి పట్టుకున్నాయి తెల్లసేనలు. అలా దొరికినవాడే ఆలం బేగ్‌! బ్రిటిష్‌ సేనలు భారతీయ సిపాయిల పట్ల ఎలా వివక్ష ప్రదర్శించేవో, తిరుగుబాటు చేస్తే ఎంత క్రూరంగా హింసించేవారో ఈ పుస్తకంలో వాగ్నర్‌ వివరించారు. ఫిరంగికి కట్టి పేల్చటం ద్వారా శరీరాన్ని తునాతునకలు చేసేవారు. తద్వారా హిందువులైనా, ముస్లింలైనా వారి ఆచార సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు జరపటానికి కూడా వీలులేకుండా క్రూరంగా వ్యవహించారు. ఈ పుర్రెను భారత్‌కు తిరిగి తీసుకెళ్లి ట్రిమ్ము ఘాట్‌ పోరాటం జరిగిన రావి నది వద్ద గౌరవప్రదంగా ఖననం చేయాలన్నది తన ఆశయమని వాగ్నర్‌ రాసుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.