Ayodhya Ram Statue In Temple : అయోధ్యలో పూజలందుకునే బాల రాముడి విగ్రహాన్ని ఆలయ గర్భగుడిలో ప్రతిష్ఠించారు. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో రాముడి విగ్రహాన్ని ట్రక్కులో ఆలయం వద్దకు తీసుకొచ్చారు. గురువారం తెల్లవారుజామున ప్రత్యేక క్రేన్ ద్వారా విగ్రహాన్ని పైకెత్తి గర్భగుడిలోకి తరలించారు. అనంతరం గర్భగుడిలో ప్రతిష్ఠించారు. వేద పండితుల మంత్రాల మధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. విగ్రహం తరలింపు పనులను మందిర నిర్మాణ కమిటీ ఛైర్పర్సన్ నృపేంద్ర మిశ్ర పర్యవేక్షించారు.
ఏడు రోజుల ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమాల్లో భాగంగా గురువారం కలశ పూజ నిర్వహించారు. సాయంత్రం జలధివాస్ కార్యక్రంలో భాగంగా విగ్రహానికి జలాభిషేకం నిర్వహిస్తారు. గణేశాంబిక పూజ, వరుణ పూజ, చతుర్వేదోక్త పుణ్యవచనం, మండప ప్రవేశం, పృథ్వి- కుర్మ- అనంత- వరాహ- యజ్ఞభూమి పూజలు జరగనున్నాయి. అనంతరం హారతి కార్యక్రమం నిర్వహిస్తారు.
గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ఠకు ముందు సాంకేతిక సమస్య తలెత్తిందని పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఇంజినీర్లు సమస్యను పరిష్కరించారని చెప్పారు.
-
#WATCH अयोध्या, उत्तर प्रदेश: भगवान राम की मूर्ति को अयोध्या में राम मंदिर के गर्भगृह के अंदर लाया गया।
— ANI_HindiNews (@AHindinews) January 18, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
मूर्ति को क्रेन की मदद से अंदर लाने से पहले गर्भगृह में विशेष पूजा की गई। (17.01)
(वीडियो सोर्स: शरद शर्मा, मीडिया प्रभारी, विश्व हिंदू परिषद) pic.twitter.com/eLrKhRVpcR
">#WATCH अयोध्या, उत्तर प्रदेश: भगवान राम की मूर्ति को अयोध्या में राम मंदिर के गर्भगृह के अंदर लाया गया।
— ANI_HindiNews (@AHindinews) January 18, 2024
मूर्ति को क्रेन की मदद से अंदर लाने से पहले गर्भगृह में विशेष पूजा की गई। (17.01)
(वीडियो सोर्स: शरद शर्मा, मीडिया प्रभारी, विश्व हिंदू परिषद) pic.twitter.com/eLrKhRVpcR#WATCH अयोध्या, उत्तर प्रदेश: भगवान राम की मूर्ति को अयोध्या में राम मंदिर के गर्भगृह के अंदर लाया गया।
— ANI_HindiNews (@AHindinews) January 18, 2024
मूर्ति को क्रेन की मदद से अंदर लाने से पहले गर्भगृह में विशेष पूजा की गई। (17.01)
(वीडियो सोर्स: शरद शर्मा, मीडिया प्रभारी, विश्व हिंदू परिषद) pic.twitter.com/eLrKhRVpcR
కాగా, బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో బాల రాముడి విగ్రహాన్ని వివేక్ సృష్టి కాంప్లెక్స్ నుంచి జన్మభూమి కాంప్లెక్స్‌కు తరలించారు. ఏటీఎస్ కమాండోల భారీ భద్రత మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. విగ్రహాన్ని అన్నివైపుల నుంచి పాలిథిన్ కవర్లతో తప్పి ఉంచారు. అంతకుముందు గర్భగుడిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించే చోట శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులతో పాటు నిర్మోహి అఖాడాకు చెందిన మహంత్ దినేంద్ర దాస్, పూజారి సునీల్ దాస్ పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు.
అయోధ్యకు స్పెషల్ వెదర్ అప్డేట్స్
అయోధ్యకు భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.అయోధ్యకు ప్రత్యేకంగా వాతావరణ అప్డేట్లు ఇవ్వనున్నట్ల తెలిపింది. ఇందుకోసం వెబ్సైట్లో ప్రత్యేక పేజీని అందుబాటులోకి తెచ్చింది. ఉష్ణోగ్రత, తేమ, గాలి వేగం సహా వాతావరణానికి సంబంధించిన వివిధ అంశాల వివరాలను అందులో పొందుపర్చింది. హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ, చైనీస్, ఫ్రెంచ్, స్పానిష్ వంటి భాషల్లో ఈ పేజీని చూడవచ్చు.
-
PHOTO | IMD launches a dedicated page for Ayodhya weather forecast. pic.twitter.com/UtOVmWTPnD
— Press Trust of India (@PTI_News) January 18, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">PHOTO | IMD launches a dedicated page for Ayodhya weather forecast. pic.twitter.com/UtOVmWTPnD
— Press Trust of India (@PTI_News) January 18, 2024PHOTO | IMD launches a dedicated page for Ayodhya weather forecast. pic.twitter.com/UtOVmWTPnD
— Press Trust of India (@PTI_News) January 18, 2024
పోస్టల్ స్టాంపులు, పుస్తకం విడుదల
అయోధ్య రామ మందిర స్మారక పోస్టల్ స్టాంపులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. మొత్తం 6 స్టాంపులను రిలీజ్ చేశారు. రామ మందిరం, గణపతి, హనుమంతుడు, జటాయు, కేవత్రాజ్, శబరి చిత్రాలతో కూడిన స్టాంపులు ఇందులో ఉన్నాయి. దీంతో పాటు రామ మందిరంపై వివిధ దేశాలు విడుదల చేసిన స్టాంపులకు సంబంధించిన పుస్తకాన్ని మోదీ ఆవిష్కరించారు. 48 పేజీల ఈ పుస్తకంలో 20కి పైగా దేశాలు విడుదల చేసిన స్టాంపులు ఉన్నాయి. అమెరికా, సింగపూర్, కెనడా, న్యూజిలాండ్, కంబోడియా వంటి దేశాలతో పాటు ఐరాస వంటి సంస్థల స్మారక స్టాంపులు ఇందులో ఉన్నాయి.
అయోధ్య రామాలయ గర్భగుడిలో ఇద్దరు బాల రాముళ్లు- కొత్త విగ్రహం తయారు చేసింది ఆయనే!
అయోధ్య గుడిలో రాముడి విగ్రహం చూశారా? విల్లుతో కమలం పువ్వుపై కొలువుదీరిన రామ్‌లల్లా