Ayodhya Ram Mandir Statue : అయోధ్యలో నూతన రామమందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుంది. అయితే గర్భగుడిలో ప్రతిష్ఠించాల్సిన విగ్రహంపై తుది నిర్ణయం తీసుకున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. గర్భగుడి నిర్మాణం కూడా పూర్తైనట్లు తెలిపారు. అలాగే జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12గంటల 20 నిమిషాలకు రాముడి విగ్రహ ప్రాణపతిష్ఠ జరుగుతుందని చంపత్ రాయ్ తెలిపారు. ఆ తర్వాత హారతి కార్యక్రమం నిర్వహించి స్థానికులు, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తామని చెప్పారు. సూర్యాస్తమయం తర్వాత దీపాలు వెలిగించాలని చంపత్ రాయ్ సూచించారు.
Ram Statue In Ayodhya Height : రాజస్థాన్, కర్ణాటకకు చెందిన ముగ్గురు శిల్పులు మొత్తం మూడు రాముడి విగ్రహాలను తయారు చేశారు. మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్, బెంగళూరుకు చెందిన కేఎల్ భట్ ముదురు రంగులో రామయ్య విగ్రహాలను తయారు చేశారు. అయితే అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన 51 అంగళూల పొడవు ఉన్న విగ్రహాన్నే ప్రాణప్రతిష్ఠ కోసం ట్రస్ట్ ఎంపిక చేసినట్లు సమాచారం.
Ram Statue In Ram Mandir Ayodhya : ఐదేళ్ల బాలుడి రూపంలో రామయ్య విగ్రహం ఉంటుందని చంపత్ రాయ్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. "రాముడి కళ్లు తామరరేకుల మాదిరిగా ఉంటాయి. ఆయన ముఖం చంద్రుడిలా ప్రకాశిస్తుంది. పెదవులపై నిర్మలమైన చిరునవ్వు ఉంటుంది. మోకాళ్ల వరకు విస్తరించి ఉన్న పొడవాటి చేతులతో విగ్రహం తయారైంది. దైవత్వం ఉట్టిపడుతున్న ఈ విగ్రహం భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ విగ్రహంలో దశరధ కుమారుడు, విష్ణుమార్తి అవతారమైన రాముడిని చక్కగా చూడవచ్చు" అని చెప్పారు.
'రామాలయ విరాళాల పేరిట నకిలీ క్యూఆర్ కోడ్'
అయోధ్య రామాలయానికి విరాళాల పేరుతో భక్తులను దోచుకునేందుకు కొన్ని ముఠాలు ప్రయత్నిస్తున్నాయని విశ్వహిందూపరిషత్ తెలిపింది. దీని కోసం సైబర్ నేరగాళ్లు సామాజిక మాధ్యమాల్లో నకిలీ క్యూఆర్ కోడ్ విధానాలను అనుసరిస్తున్నట్లు హెచ్చరించింది. రామమందిర నిర్మాణపనులను శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షిస్తున్నందున విరాళాల సేకరణకు మరెవరికీ అనుమతి ఇవ్వలేదని వీహెచ్‌పీ అధికారప్రతినిధి వినోద్ బన్సల్ తెలిపారు.
ప్రారంభోత్సవ కార్యక్రమ వివరాలు ఇలా!
Ram Mandir Opening Ceremony : మరోవైపు, అయోధ్య రామాలయ గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు 2024 జనవరి 16వ తేదీ నుంచి మొదలుకానున్నాయి. 17వ తేదీన 51 అంగుళాల బాల రాముడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువస్తారు. జనవరి 20న సరయూ నదీజలాలతో రామమందిరాన్ని శుద్ధి చేస్తారు. అదే రోజు వాస్తు పూజలు నిర్వహిస్తారు. 21న బాల రాముడి విగ్రహం సంప్రోక్షణ ఉంటుంది. 22న ఉదయం పూజల అనంతరం మృగశిర నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో బాల రాముడి విగ్రహాన్ని శాశ్వత ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ విగ్రహాన్ని భక్తులు 35 అడుగుల దూరం నుంచే దర్శించుకునే వీలుంది.
'అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠకు దేశవ్యాప్తంగా సెలవు'- గర్భగుడి ఫొటో చూశారా?
100 దేవతా విగ్రహాలతో భారీ ఊరేగింపు- రాముడి జీవితం ఉట్టిపడేలా అయోధ్యలో శోభాయాత్ర
అయోధ్య రామ మందిరం ఓపెనింగ్‌కు 1000 ప్రత్యేక రైళ్లు- ఎప్పట్నుంచంటే?
'ఆత్మనిర్భరతతో అయోధ్య రామమందిరం- ఆలయానికి సొంత వ్యవస్థలు- పచ్చదనానికి పెద్దపీట'
51 అంగుళాల విగ్రహం, 392 స్తంభాలు, లక్షల అడుగుల పాలరాయి- అంకెల్లో 'అయోధ్య అద్భుతాలు' ఇవిగో!