Ayodhya Ram Mandir Pran Pratishtha : అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ జరిగే రోజు జాతీయ సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు ఓ సాధువు. 2024 జనవరి 22న దేశవ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించాలని మహారాష్ట్రకు చెందిన సాధువు మహంత్ అంకిత్ శాస్త్రి మహారాజ్ కోరారు. ఫలితంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించే అవకాశం దక్కుతుందని తెలిపారు. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. 130 దేశాల ప్రతినిధులతో పాటు అనేక మంది సాధువులు రానున్నారు. తాజాగా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రామమందిర గర్భగుడి చిత్రాన్ని ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
-
प्रभु श्री रामलला का गर्भ गृह स्थान लगभग तैयार है। हाल ही में लाइटिंग-फिटिंग का कार्य भी पूर्ण कर लिया गया है। आपके साथ कुछ छायाचित्र साझा कर रहा हूँ। pic.twitter.com/yX56Z2uCyx
— Champat Rai (@ChampatRaiVHP) December 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">प्रभु श्री रामलला का गर्भ गृह स्थान लगभग तैयार है। हाल ही में लाइटिंग-फिटिंग का कार्य भी पूर्ण कर लिया गया है। आपके साथ कुछ छायाचित्र साझा कर रहा हूँ। pic.twitter.com/yX56Z2uCyx
— Champat Rai (@ChampatRaiVHP) December 9, 2023प्रभु श्री रामलला का गर्भ गृह स्थान लगभग तैयार है। हाल ही में लाइटिंग-फिटिंग का कार्य भी पूर्ण कर लिया गया है। आपके साथ कुछ छायाचित्र साझा कर रहा हूँ। pic.twitter.com/yX56Z2uCyx
— Champat Rai (@ChampatRaiVHP) December 9, 2023
భక్తుల కోసం టెంట్లు ఏర్పాటు
మరోవైపు నెలరోజుల్లో ప్రారంభయ్యే అయోధ్య రామమందిరం ఉత్సవానికి వచ్చే భక్తులకోసం అయోధ్య అభివృద్ధి సంస్థ (ADA)టెంట్‌లను నిర్మించింది. ఓ ప్రైవేటు సంస్థతో కలిసి జర్మన్ టెక్నాలజీతో దాదాపు 30వాటర్ ప్రూఫ్ టెంట్‌లను ఏర్పాటు చేసినట్లు ADA వెల్లడించింది. రామాలయ ప్రారంభోత్సవానికి దేశం నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఈ టెంట్‌లను సిద్ధం చేసినట్లు తెలిపింది. అయితే వాటికోసం ముందుగానే బుక్ చేసుకోవాలని సూచించింది.
అయోధ్య చరిత్రపై వెబినార్
అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో డిసెంబర్ 9 నుంచి ఐదు రోజుల పాటు వెబినార్‌ను నిర్వహించనున్నారు. 500 ఏళ్ల నాటి రామాలయ చరిత్రను తెలిపేలా ఈ వెబినార్‌ను నిర్వహిస్తున్నారు అమెరికాకు చెందిన హిందువులు. హిందూ యూనివర్సిటీతో పాటు అమెరికా విశ్వ హిందూ పరిషత్ సంస్థలు కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. 9వ తేదీన అయోధ్య రామాలయాన్ని పునర్నిర్మాణానికి జరిగిన పోరాటంపై భారత పురావస్తు శాఖ రీజనల్ డైరెక్టర్ కేకే మహ్మద్ మాట్లాడనున్నారు. 10న రామాలయ నిర్మాణ చరిత్రపై బీజేపీ ఎంపీ సుధాంశూ త్రివేది ప్రసంగించనున్నారు. జనవరి 6న జరిగే మూడో వెబినార్‌లో న్యాయ అంశాలపై జ్ఞాన్వాపీ కేసు న్యాయవాది విష్ణు శంకర్ జైన్, 7న ప్రముఖ రచయిత ఆనంద్ రంగనాథన్ మాట్లాడనున్నారు. చివరి వెబినార్ జనవరి 13న నిర్వహించనుండగా, వక్తల పేర్లను మాత్రం వెల్లడించలేదు.
బాలరాముడి విగ్రహ సెలక్షన్ అప్పుడే- సచిన్, కోహ్లీ, అంబానీకి ఆహ్వానం- బార్కోడ్ ద్వారా ఎంట్రీ!
అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానాలు- పోస్ట్ ద్వారా 4వేల మంది సాధువులకు ఇన్విటేషన్