ETV Bharat / bharat

అయోధ్య మసీదుకు ఆయన పేరు!

అయోధ్యలో నిర్మించనున్న మసీదు, ఆసుపత్రి కాంప్లెక్స్​కు స్వాతంత్య్ర సమరయోధుడు మౌల్వి అహ్మదుల్లా షా ఫైజాబాది పేరు పెట్టాలని నిర్ణయించినట్లు ఇండో-ఇస్లామిక్​ కల్చరల్​ ఫౌండేషన్ తెలిపింది. ఈ ప్రాజెక్టులోని అన్నింటినీ ఆయనకు అంకితమిస్తున్నట్లు పేర్కొంది. ​

Ayodhya masque
మౌల్వి అహ్మదుల్లా షా ఫైజాబాది
author img

By

Published : Jun 6, 2021, 3:07 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ అయోధ్యలోని ధనిపుర్​ గ్రామంలో నిర్మిస్తున్న మసీదు, ఆసుపత్రి కాంప్లెక్స్​కు స్వాతంత్య్ర సమరయోధుడి పేరు పెట్టాలని నిర్ణయించారు. దేశ విముక్తి కోసం పోరాటం చేసి, 164 ఏళ్ల క్రితం ప్రాణాలర్పించిన మౌల్వి అహ్మదుల్లా షా ఫైజాబాది పేరును పెట్టనున్నారు. ఈ ప్రాజెక్టులోని మసీదు, ఆసుపత్రి, మ్యూజియం, పరిశోధన కేంద్రం, కమ్యూనిటీ కిచెన్​లను ఫైజాబాదికి అంకితమివ్వనున్నట్లు ఇండో-ఇస్లామిక్​ కల్చరల్​ ఫౌండేషన్​(ఐఐసీఎఫ్​) తెలిపింది.

" ఆయన అమరుడైన రోజున.. ఈ మొత్తం ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలని నిర్ణయించాం. జనవరిలో పరిశోధన కేంద్రాన్ని ఫైజాబాదికి అంకితమిచ్చాం. తొలి స్వాతంత్ర్య పోరాటం తర్వాత 160 ఏళ్లు గడిచినా.. ఆయనకు భారత చరిత్రలో సరైన స్థానం దక్కలేదు. ఫైజాబాద్​లోని సరాయ్​ మసీదు ఆయన పేరుతో ఉన్న ఏకైక భవనం. "

- అథర్​ హుస్సేన్​, ఐఐసీఎఫ్​ కార్యదర్శి

అయోధ్య మసీదు, ఆసుపత్రి ప్రాజెక్టును ఐదు ఎకరాల్లో నిర్మిస్తున్నారు. వారికి ఆ స్థలం కేటాయించాలని 2019, నవంబర్​లో సుప్రీం కోర్టు ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇదీ చూడండి: 'హజ్ యాత్రపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.