ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం చేసిన దీపోత్సవ ఏర్పాట్లు ప్రపంచ రికార్డు సృష్టించాయి. శుక్రవారం సూర్యాస్తమయం కాగానే 8 వేల వాలంటీర్లు సరయూ నదీతీరాన 6 లక్షలకుపైగా దివ్వెలు వెలిగించారు. ఈ వేడుకకు హాజరైన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు.. మొత్తం 6,06,569 దీపాలను మట్టి ప్రమిదలతో వెలిగించినట్లుగా గుర్తించారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
మధ్యాహ్నం అయోధ్యలోని సాకేత్ కళాశాల నుంచి ప్రారంభమైన శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవ ఊరేగింపు 5 కి.మీ.ల దూరంలోని సరయూ నదీతీరం వరకు సాగింది.