ETV Bharat / bharat

అయోధ్య గుడిలో రాముడి విగ్రహం చూశారా? విల్లుతో కమలం పువ్వుపై కొలువుదీరిన రామ్​లల్లా - అయోధ్య బాల రాముడి విగ్రహం

Ayodhya Bala rama Statue Photos : అయోధ్య రామమందిరంలో కొలువుదీరనున్న బాల రాముడి విగ్రహం ఫొటోలు బయటకు వచ్చాయి. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అహ్వాన పత్రికలపై బాలరాముడి రూపాన్ని ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. ఇంతకీ బాల రాముడు ఎలా ఉన్నాడంటే?

Ayodhya Bala rama Statue Photos
Ayodhya Bala rama Statue Photos
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2024, 1:40 PM IST

Ayodhya Bala rama Statue Photos : అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆలయ గర్భగుడిలో ప్రతిష్ఠించబోయే విగ్రహం గురించి చర్చ జరుగుతోంది. ఇప్పటికే కర్ణాటకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్​ యోగిరాజ్ చెక్కిన విగ్రహాన్ని ఎంపిక చేసినా, ఆ బాలరాముడి రూపం ఎలా ఉంటుంది అన్నది ఆలయ ట్రస్ట్​ వెల్లడించలేదు. దానికి సంబంధించిన ఎలాంటి చిత్రాలు ప్రచురించలేదు. అయితే ఆ విగ్రహ రూపాన్ని ఇప్పటికే ప్రముఖులకు అందించిన ఆహ్వాన పత్రికలపై ముద్రించారని 'ఈటీవీ భారత్'​ పరిశీలనలో తేలింది. బాలుడి రూపంలో ఉన్న రాముడు, చేతిలో విల్లుతో కమలం పువ్వుపై నిల్చుని ఉన్నారు.

Ayodhya Bala rama Statue Photos
బాల రాముడి విగ్రహ రూపం
్
ప్రాణప్రతిష్ఠ ఆహ్వాన పత్రికపై ముద్రించిన బాలరాముడి రూపం

మొత్తం ముగ్గురు వేర్వేరు శిల్పులు మలిచిన మూడు విగ్రహాలను పరిశీలించి, యోగిరాజ్‌ చెక్కిన ప్రతిమను ఎంపిక చేసినట్లు ఇటీవల శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ వెల్లడించారు. యోగిరాజ్‌ ఎంతో ఏకాగ్రత, భక్తిశ్రద్ధలతో దైవత్వం ఉట్టిపడేలా అద్భుతంగా విగ్రహన్ని చెక్కారని చంపత్‌రాయ్‌ ప్రశంసించారు. విగ్రహ తయారికీ ఆయన చేసిన త్యాగాన్ని కొనియాడారు. ఐదేళ్ల వయసున్న బాల రాముడు నిలబడి ఉన్న రూపంలో విగ్రహం ఉంటుందని తెలిపారు. రాముడి కళ్లు తామర రేకుల మాదిరిగా ఉంటాయని, ముఖం చంద్రుడిలా ప్రకాశిస్తుందన్నారు. పెదవులపై నిర్మలమైన చిరునవ్వు ఉంటుందని పొడవాటి చేతులతో విగ్రహం ఉంటుందన్నారు. బుధవారం నాడు రామ్‌లల్లా విగ్రహం ఊరేగింపుగా అయోధ్యకు చేరుకుంటుందని చంపత్‌ రాయ్‌ తెలిపారు.

Ayodhya Bala rama Statue Photos
ప్రాణప్రతిష్ఠ ఆహ్వాన పత్రికపై ముద్రించిన అయోధ్య రామాలయం
Ayodhya Bala rama Statue Photos
అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ ఆహ్వాన పత్రిక

6 నెలలు మౌన వ్రతం
ఎంతో నిష్ఠతో, నియమాలతో బాలరాముడి విగ్రహన్ని యోగిరాజ్ తయారుచేశారు. దాదాపు 6 నెలలు పాటు ఎవరీతో మాట్లాడకుండా బయట ప్రపంచానికి దూరంగా ఉండి ఎంతో భక్తి శ్రద్ధలతో రామ్‌లల్లా విగ్రహన్ని యోగిరాజ్‌ రూపొందించారు. కనీసం కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడకుండా నిష్ఠతో తయారుచేశారు. విగ్రహాన్ని తయారు చేసిన అన్నిరోజులు యోగిరాజ‌్ సెల్‌ఫోను కూడా వాడలేదని అతని కుటుంబసభ్యులు తెలిపారు. తమ కుమారుడు చేసిన ప్రతిమ ఎంపికవ్వడం పట్ల యోగిరాజ్‌ తల్లి అశ్వతి సంతోషం వ్యక్తం చేశారు.

100 కిలోల బంగారు తాపడం
రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రామ మందిరం ముస్తాబవుతోంది. సమయం దగ్గరపడుతుండటం వల్ల కార్మికులు 24 గంటలు పని చేస్తున్నారు. తాజాగా ఆలయ గ్రౌండ్ ఫ్లోర్‌లో స్వర్ణ తాపడం చేసిన తలుపుల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేశారు. రామ మందిరంలో మొత్తం 46 తలుపులు ఉండగా 42 తలుపులకు 100 కిలోల బంగారు తాపడాన్ని అద్దనున్నారు. గర్భ గుడిలో అమర్చిన బంగారు తలుపులు దాదాపు 12 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పుతో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఆలయ ట్రస్టు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మెుత్తం 14 తలుపులు ఉంటాయని పేర్కొంది. స్వర్ణ తాపడం చేసిన తలుపులు అమరిక పూర్తైందని తెలిపింది.

Ayodhya Bala rama Statue Photos
విద్యుత్ కాంతుల్లో అయోధ్య రామాలయం
Ayodhya Bala rama Statue Photos
రాత్రి వేళ విద్యుత్ వెలుగుల్లో రామమందిరం
Ayodhya Bala rama Statue Photos
అయోధ్య రామాలయం

రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు 55 దేశాల అతిథులు- అక్కడి నుంచే మోదీ ప్రసంగం

అయోధ్య రామాలయ గర్భగుడిలో ఇద్దరు బాల రాముళ్లు- కొత్త విగ్రహం తయారు చేసింది ఆయనే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.