ETV Bharat / bharat

పిల్లలకు టీకాపై ఎయిమ్స్​ చీఫ్​ కీలక వ్యాఖ్యలు - చిన్నారుల కోసం ఫైజర్​ టీకా

గత ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారితో పిల్లల చదవుకు తీరని నష్టం వాటిల్లిందని ఎయిమ్స్​ చీఫ్​ డాక్టర్ రణదీప్​ గులేరియా తెలిపారు. చిన్నారుల కోసం కొవిడ్​ టీకా వస్తే పాఠశాలలు పునఃప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు.

ranadeep gureria, aiims director
రణదీప్​ గులేరియా, ఎయిమ్స్​ చీఫ్​
author img

By

Published : Jun 27, 2021, 5:05 PM IST

పిల్లల కోసం కొవిడ్​ టీకా అందుబాటులోకి వస్తే అది కీలకమైన విజయమని ఎయిమ్స్​ చీఫ్​ డాక్టర్​ రణదీప్​ గులేరియా పేర్కొన్నారు. తద్వారా పాఠశాలలను పునఃప్రారంభించటం సహా చిన్నారులు స్వేచ్ఛగా బహిరంగ కార్యాకలాపాల్లో పాల్గొనేందుకు అవకాశం లభిస్తుందని చెప్పారు. 2 నుంచి 18 ఏళ్ల లోపు వయస్సు వారి కోసం భారత్​ బయోటెక్​ సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్​ టీకా.. రెండో, మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​​ సమాచారం సెప్టెంబర్​ నాటికి వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు గులేరియా.

"కొవిడ్ మహమ్మారి వల్ల ఏడాదిన్నరగా పిల్లలకు తమ చదువుల్లో తీరని నష్టం ఏర్పడింది. పాఠశాలలను పునఃప్రారంభించటంలో చిన్నారులకు టీకా అందించే ప్రక్రియ.. అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. భారత్​ బయోటెక్ కంటే ముందే ఫైజర్​ వ్యాక్సిన్​.. చిన్నారులు కోసం అందుబాటులోకి వస్తే అది సదవకాశమే. జైడస్​ వ్యాక్సిన్​కు అనుమతి లభించినా అది మరో అవకాశమే."

-డాక్టర్​ రణదీప్​ గులేరియా, ఎయిమ్స్​ చీఫ్​

పిల్లలకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నా, అసలు లక్షణాలే లేకపోయినా కూడా వారి ద్వారా ఇతరులకు వైరస్​ వ్యాపించే ప్రమాదం ఉందని గులేరియా హెచ్చరించారు. మహమ్మారి కోరల నుంచి బయటపడాలంటే టీకా ప్రక్రియను ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఫార్మా దిగ్గజం జైడస్​ క్యాడిలా సంస్థ తమ జైకోవ్​-డి టీకాకు అత్యవసర వినియోగం కోసం డ్రగ్​ కంట్రోలర్​ జనరల్ ఆఫ్​ ఇండియా(డీసీజీఐ)కి త్వరలోనే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఓ సీనియర్​ అధికారి తెలిపారు. ఈ టీకాను పెద్దలతో పాటు చిన్నారులకూ అందివచ్చని ఆ సంస్థ చెబుతోంది.

ఇదీ చూడండి: Vaccine for children: చిన్న పిల్లలకు టీకా ఎప్పుడు? ఎలా?

ఇదీ చూడండి: ఆ రెండు టీకాలతో పిల్లల్లో కరోనాకు చెక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.