ETV Bharat / bharat

ప్రేమ పెళ్లి చేసుకుందని సోదరి హత్య.. తలను వేరు చేసి.. - ఔరంగాబాద్​ పరువు హత్య

Aurangabad honour killing: వేరే కులం వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుందనే కారణంతో సొంత సోదరిని అతికిరాతకంగా హత్య చేశాడు ఓ యువకుడు. కొడవలితో దాడి చేసి.. శరీరం నుంచి తలను వేరు చేశాడు. మహారాష్ట్ర ఔరంగాబాద్​లో జరిగిన ఈ ఘటన.. స్థానికంగా కలకలం రేపింది.

Aurangabad honour killing
సోదరిని చంపి.. తలను వేరు చేసి..
author img

By

Published : Dec 6, 2021, 2:36 PM IST

Brother killed sister: మహారాష్ట్ర ఔరంగాబాద్​లో పరువు హత్య కలకలం రేపింది. వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కారణంతో సొంత సోదరిని అతికిరాతకంగా హత్య చేశాడు ఓ యువకుడు.

Aurangabad honour killing
ఘటన జరిగిన ఇల్లు..

తల్లి సహాయంతో!

గోయేగావ్​ గ్రామానికి చెందిన 19ఏళ్ల యువతి.. వైజాపుర్​లోని లడ్గావ్​కు చెందిన వ్యక్తితో ప్రేమలో పడింది. ఆరు నెలల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయి పుణెలో వారు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరు లడ్గావ్​లో నివాసముంటున్నారు.

కొన్ని రోజుల క్రితం.. ఆ యువతి తల్లి ఆమెను కలిసింది. ఆమె ఫోన్​ నెంబర్​ తీసుకుంది. ఆదివారం నాడు.. ఆ యువతి తల్లి, సోదరుడు లడ్గావ్​కు వెళ్లారు. యువతి ఇంటి వద్ద ద్విచక్రవాహనాన్ని ఆపి ఆమె సోదరుడు ఇంటి లోపలికి వెళ్లాడు.

ఆ సమయంలో ఆ యువతి వంటింట్లో పని చేసుకుంటోంది. సోదరిని చూసిన వెంటనే.. కోపం తెచ్చుకున్న యువకుడు ఆమెపై దాడి చేశాడు. కొడవలితో ఆమె తలను నరికి.. శరీరం నుంచి వేరు చేశాడు.

Aurangabad honour killing:
భర్తతో యువతి

ఈ దృశ్యాలు పక్కనే ఉన్న ఆ యువతి భర్త చూసి షాక్​కు గురయ్యాడు. వెంటనే తేరుకుని, ప్రాణాలు రక్షించుకునేందుకు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. చుట్టుపక్కన ప్రజలు పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడు, అతడి తల్లిని అరెస్టు చేశారు. కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఇదీ చూడండి:- పెళ్లి చేయట్లేదనే కోపంతో... తల్లిని చంపిన కొడుకు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.