ETV Bharat / bharat

రెండో భార్య కోసం నగరమంతా బ్యానర్లు.. ఎన్నికల్లో పోటీ చేసేందుకట! - భార్య కోసం బ్యానర్లు

Banner for second wife: ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు రెండో భార్య కావాలంటూ నగరం మొత్తం బ్యానర్లు ఏర్పాటు చేశాడు ఓ వ్యక్తి. కాబోయే భార్యకు ఎలాంటి లక్షణాలు ఉండాలో వాటిలో పేర్కొన్నాడు.

wife advertise banner
రెండో భార్య కోసం నగరమంతా బ్యానర్లు
author img

By

Published : Jan 30, 2022, 7:38 PM IST

Banner for second wife: మహారాష్ట్ర, ఔరంగాబాద్​లో ఓ వ్యక్తి హాట్​టాపిక్​గా మారాడు. తనకు రెండో భార్య కావాలంటూ నగరం మొత్తం బ్యానర్లు ఏర్పాటు చేయటమే అందుకు కారణం. కాబోయే భార్యకు ఎలాంటి లక్షణాలు ఉండాలనే విషయాన్నీ వాటిలో పేర్కొన్నాడు.

aurangabad
రెండో భార్య కోసం నగరంలో ఏర్పాటు చేసిన బ్యానర్​

అసలు కథ ఇది..

ఔరంగాబాద్​ మున్సిపల్​ ఎన్నికలు కొద్ది రోజుల్లో రానున్నాయి. రమేశ్​ పాటిల్​ అనే వ్యక్తి పోటీ చేయాలనుకున్నాడు. కానీ, అతనికి ముగ్గురు పిల్లలు ఉండటం వల్ల ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోయాడు. ఎలాగైనా బరిలో నిలవాల్సిందేనని పట్టుదలతో ఉన్న రమేశ్​.. ఓ ఉపాయం చేశాడు. తాను నిలబడలేకపోయినా.. తన కుటుంబంలో నుంచి ఒకరిని పోటీలో నిలపాలనుకున్నాడు. అయితే, సోదరుడు, సోదరి, తల్లిదండ్రులను కాదండోయ్​.. రెండో పెళ్లి చేసుకుని వచ్చే భార్యను ఎన్నికల్లో పోటీ చేయించాలని సంకల్పించుకున్నాడు.

ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు రెండో భార్య కావాలంటూ ఏకంగా నగరం మొత్తం బ్యానర్లు కట్టించాడు. తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో ఆ హోర్డింగుల్లో పేర్కొన్నాడు. ఏ మతం అయినా, పెళ్లి కాని లేక భర్తతో విడిపోయిన, భర్త మరణించిన 25 నుంచి 40 ఏళ్ల మహిళ అర్హురాలిగా తెలిపాడు. అయితే, పెళ్లి అయి ఉంటే ఆ మహిళకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలనే షరతు పెట్టాడు. తన ఫోన్​ నంబర్​ సైతం బ్యానర్లలో అచ్చు వేయించాడు.

ఇప్పుడు ఆయన ప్రకటనపైనే నగర జనం మొత్తం చర్చించుకుంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: 'టీకా తీసుకుంటే నా 8 మంది పిల్లలేంగాను?'.. వీడియో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.