ETV Bharat / bharat

'మా పెళ్లికి రండి- కరోనా నెగెటివ్​ రిపోర్ట్ తప్పనిసరి!' - హరిద్వార్​లో నెెగెటివ్​ రిపోర్ట్​ ఉంటేనే పెళ్లికి రావాలన్న జంట

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఓ వివాహ పత్రిక ఇప్పుడు చర్చనీయాంశమైంది. త్వరలో ఒక్కటికానున్న.. ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​కు చెందిన ఓ జంట తమ వివాహ వేడుకకు ఆర్​టీ-పీసీఆర్​ నెగెటివ్​ రిపోర్ట్​ తప్పనిసరి చేయటమే ఇందుకు కారణం.

wedding card
వివాహ ఆహ్వాన పత్రిక
author img

By

Published : Apr 17, 2021, 11:59 AM IST

Updated : Apr 17, 2021, 1:22 PM IST

కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో కొవిడ్ నెగెటివ్​ రిపోర్టు ఉంటేనే కొన్ని దేశాలు, రాష్ట్రాలు ప్రయాణికుల్ని.. అనుమతిస్తున్నాయి. కానీ ఉత్తరాఖండ్​, హరిద్వార్​కు చెందిన ఓ కాబోయే జంట.. తమ వివాహానికి రావాలంటే బంధువులకు ఆర్​టీ- పీసీఆర్​ నెగెటివ్​ రిపోర్ట్​ తప్పనిసరి చేసింది. వివాహ ఆహ్వాన పత్రికపై ఇది ముద్రించడమే విశేషం. ఈ విషయంపై పలువురు ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు.

wedding card
వివాహ ఆహ్వాన పత్రిక
wedding card
వధూవరులు

హరిద్వార్​కు చెందిన వరుడు విజయ్​.. రాజస్థాన్​లోని జైపుర్​కు చెందిన వధువు వైశాలి ఈ నెల 24న ఒక్కటికానున్నారు. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను పాటిస్తూ వివాహ వేడుకను నిర్వహించేందుకే ఇలా చేశామని చెబుతున్నారు.

''మేం విహహ పత్రికలు పంచడానికి ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కొత్త నిబంధనలను జారీ చేశాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు వివాహం చేసుకోవాలనుకుంటున్నాం.''

-విజయ్​, వరుడు

వివాహ వేడుక-135 మందికి పాజిటివ్​

ఛత్తీస్​గఢ్​లోని జాంజ్​గీర్​​- చంపా జిల్లాలో ఓ వివాహ వేడుక.. కరోనా వ్యాప్తికి ప్రధాన కారణం అయింది. అందులో పాల్గొన్న 135 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. 400 మందికి పైగానే ఆ వేడుకలో పాల్గొన్నారు. పాజిటివ్​గా తేలినవారిని గృహ నిర్బంధంలో ఉంచారు అధికారులు.

ఛత్తీస్​గఢ్​లో రోజూ సగటున 10 వేలకుపైనే కొవిడ్​ కేసులు నమోదవుతున్నాయి.

ఇదీ చదవండి: 'కుంభమేళాలో భక్తుల సంఖ్య పరిమితంగా ఉండాలి'

ఇదీ చదవండి: 'రైతు ఉద్యమ స్థలాల్లో టీకా కేంద్రాల ఏర్పాటు!'

Last Updated : Apr 17, 2021, 1:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.