ఉత్తర్ప్రదేశ్ మథురా జిల్లా యమునా ఎక్స్ప్రెస్ హైవేపై జరిగిన బస్సు ప్రమాదంలో 36 మందికి గాయపడ్డారు. అధికారులు.. బాధితులను స్థానికంగా ఉన్న వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 100 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
బిహార్లోని మధుబనీ నుంచి దిల్లీ వెళ్తున్న ఈ డబుల్ డెక్కర్ బస్సు ముందు చక్రాలు మార్గమధ్యంలో బయటకు వచ్చేశాయని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో బస్సు బోల్తా పడిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
ఇదీ చదవండి : కారు-లారీ ఢీకొని ఐదుగురు మృతి: హత్యా? ప్రమాదమా?