ETV Bharat / bharat

55వేల చందమామ ఫొటోలతో అందమైన చిత్రం - చందమామ

ఖగోళశాస్త్రంపై మక్కువతో 16 ఏళ్ల బాలుడు చంద్రుడిని పలు కోణాల నుంచి 55వేల ఫొటోలు తీశాడు. అన్నింటిని కలిపి అందమైన చందమామ ఫొటో తయారు చేశాడు.

moon
చందమామ
author img

By

Published : May 19, 2021, 8:05 PM IST

55వేల చందమామ ఫొటోలతో ఆకర్షణీయమైన చిత్రం

మహారాష్ట్రలోని పుణెకు చెందిన 16ఏళ్ల ప్రథమేశ్​ జాజు ఫొటోగ్రఫీలో సత్తాచాటుతున్నాడు. ఖగోళశాస్త్రంపై మక్కువతో చందమామను వివిధ కోణాల్లో 55వేల ఫొటోలను తీశాడు. ఆ ఫొటోలన్నింటినీ కలిపి ఆకర్షణీయమైన చంద్రుని ఫొటోగా తీర్చిదిద్దాడు.

moon
55వేల ఫొటోలతో చందమామ
moon
ప్రథమేశ్​ జాజు

ఇందుకు జ్యోతిర్విద్యా సంస్థ సాయం తీసుకున్నాడు. తన ఇంటిమీద నుంచి మే3 న ఉదయం 1:30 నుంచి 5:30 వరకు జెడ్​డబ్ల్యూ ఓఏఎస్ఐ 120ఎమ్​సీ- ఎస్​ అనే టెలిస్కోప్​తో ఈ ఫొటోలను తీశాడు.

"మొదట చందమామ వీడియోలను తీశాను. తర్వాత వాటినుంచి ఫొటోలను తయారు చేశాను. ఫొటోషాప్​లో ఆ ఫొటోలను కలిపి.. చంద్రుని రూపం వచ్చేలా తీర్చిదిద్దాను. ఇందుకు మసాయిక్​ పనోరమ సాంకేతికతను వాడాను."

-ప్రథమేశ్​ జాజు

ఈ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా.. నెటిజన్ల నుంచి విపరీతమైన లైక్​లు వచ్చాయి.

ఇదీ చదవండి: దొంగతనం చేసి.. గాల్లో వేలాడుతూ దొరికిపోయి...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.