ETV Bharat / bharat

11 నెలల తర్వాతే వ్యాక్సిన్​​ రెండో డోసు!

author img

By

Published : Jun 29, 2021, 5:24 PM IST

టీకా డోసుల మధ్య వ్యవధి ఎంతుంటే మంచిదనే అంశంపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో ఇప్పుడు కొవిషీల్డ్​కు 12-16 వారాల సమయం ఉండగా.. కొవాగ్జిన్​ రెండో డోసును 4-6 వారాల అంతరం ఉంది. అయితే.. కొవిషీల్డ్​ రెండో డోసు 45 వారాల తర్వాత తీసుకుంటే.. రోగ నిరోధక వ్యవస్థ మరింత బలంగా తయారవుతుందని ఓ అధ్యయనం చెబుతోంది.

AstraZeneca Covid vaccine produces stronger immune response with 11-month gap
11 నెలల తర్వాతే వ్యాక్సిన్​​ రెండో డోసు

టీకాల కొరత వేధిస్తున్న వేళ.. యూకేలోని ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ అధ్యయనం ఆసక్తికర విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. వ్యాక్సిన్​ డోసుల మధ్య వ్యవధి ఎంత ఎక్కువుంటే.. ఫలితం అంతా బాగా ఉంటుందని తెలిపింది. రోగనిరోధక శక్తి మరింత పెరుగుతుందని వెల్లడించింది.

ఆక్స్​ఫర్డ్​-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్(భారత్​లో కొవిషీల్డ్​)​ డోసుల మధ్య వ్యవధిని 45 వారాలకు(దాదాపు 11 నెలలు) పెంచడం వల్ల మరింత బలమైన రోగనిరోధకత ఏర్పడినట్లు పరిశోధకులు నిర్ధరించారు. 18-55 ఏళ్ల మధ్య వలంటీర్లపై ట్రయల్స్​ చేసి ఈ విషయాన్ని తేల్చారు.

అయితే.. కొవిషీల్డ్​ తొలి డోసుతో వచ్చిన యాంటీబాడీలు సంవత్సరం పాటు ఉంటాయా అనే దానిపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉందని ఆక్స్​ఫర్డ్​ పరిశోధకులు తెలిపారు.

ఆపై 6 నెలలకు బూస్టర్​ డోసు..

ఇంకా.. రెండో డోసు ఇచ్చిన ఆరు నెలలకు బూస్టర్​ డోసు(మూడో డోసు) ఇస్తే.. యాంటీబాడీలు గణనీయ స్థాయిలో మెరుగుపడ్డట్లు అధ్యయనం పేర్కొంది. లాన్సెట్​ ప్రీ ప్రింట్​ సర్వర్​లో సంబంధిత పరిశోధన ప్రచురితమైంది.

ప్రస్తుతం భారత్​లో ఇస్తున్న కొవిషీల్డ్​ టీకా డోసుల మధ్య అంతరం 12 నుంచి 16 వారాలుగా ఉంది. 45 వారాలకు రెండో డోసు తీసుకుంటే వచ్చే యాంటీబాడీలు.. ఈ వ్యవధితో పోల్చితే నాలుగు రెట్లు అధికమని అధ్యయనంలో తెలిసింది.

టీకాలు తక్కువగా ఉన్న దేశాలకు ఇది ఊరట కలిగించే వార్త అని అధ్యయనంలో పాల్గొన్న చీఫ్​ ఇన్వెస్టిగేటర్​ ఆండ్రూ జె. పొలార్డ్​. వ్యవధి 10 నెలలు ఉన్నా.. మంచిదేనని చెబుతున్నారు.

ఇదీ చదవండి: కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధి పెంపు!

కొవిడ్ టీకా రెండు డోసుల మధ్య ఎంత వ్యవధి ఉండాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.