UP Assembly Elections 2022: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై చర్చించేందుకు సమావేశమైంది భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ. తొలి మూడు విడతల్లో పోటీ చేసేందుకు సుమారు 172 మంది అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఈ జాబితాను ఈనెల 16 లేదా 17న ప్రకటిస్తారని తెలిసింది.
గత రెండు రోజులుగా అభ్యర్థుల ఖరారు, మిత్రపక్షాలకు కేటాయించే సీట్లపై కసరత్తు చేశారు హోం మంత్రి అమిత్ షా. బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు పార్టీకి చెందిన ముఖ్యులు, అప్నాదళ్ పార్టీ నేత అనుప్రియ పటేల్, ఇతర నేతలతో మంతనాలు జరిపారు.
కేంద్ర మంత్రులు అమిత్ షా, అనురాగ్ ఠాగూర్, ధర్మేంద్ర ప్రధాన్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు వర్చువల్‌గా హాజరయ్యారు.