ETV Bharat / bharat

ప్రజాతీర్పు- బీజేపీ ట్రిపుల్‌ ధమాకా- మూడు రాష్ట్రాల్లో కమలం సునామీ - మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కౌంటింగ్

Assembly Election 2023 Live Updates In Telugu : హిందీ రాష్ట్రాల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోగా ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ను గద్దె దించి కమలం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.

assembly election 2023 live updates in telugu

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 8:01 AM IST

Updated : Dec 3, 2023, 5:14 PM IST

  • 05.12 PM
    పార్లమెంట్‌లోని విపక్ష నేతల ఛాంబర్​లో సోమవారం ఉదయం 10 గంటలకు ఇండియా కూటమి పార్లమెంటరీ నేతలు సమావేశమవ్వనున్నారు.
  • 05.08 PM
    నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. తెలంగాణలో తమ పార్టీకి అవకాశం కల్పిస్తూ తీర్పు ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌ చెబుతూ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. తెలంగాణ మినహా మిగతా మూడు రాష్ట్రాల్లో తమ పార్టీకి వచ్చిన ఫలితాలు నిస్సందేహంగా నిరుత్సాహానికి గురిచేశాయన్నారు. కానీ మరింత దృఢ నిశ్చయంతో ఈ మూడు రాష్ట్రాల్లో తమను తాము పునర్నిర్మించుకొనేందుకు పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఖర్గే గుర్తు చేశారు. తాత్కాలిక ఎదురుదెబ్బలను అధిగమించి ఇండియా కూటమితో లోక్​సభ ఎన్నికలకు పూర్తిగా సిద్ధమవుతామని తెలిపారు.
  • 04.43 PM
    సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా భావించే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నాలుగు రాష్ట్రాల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో బీజేపీకి భారీ విజయం దక్కింది. ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలను మించి హిందీ రాష్ట్రాలైన రాజస్థాన్‌, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో కాషాయ జెండా రెపరెపలాడింది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్​లో అఖండ మెజార్టీతో కమలనాథులు ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. ఇక, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ను గద్దె దించి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయమైంది.
  • 04.30 PM
    రాజస్థాన్​లో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. మ్యాజిక్​ ఫిగర్​ 101ను సొంతం చేసుకుంది. మరో 15 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. కాంగ్రెస్​ 61 స్థానాలు గెలిచింది.
  • 02.23 PM
    అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్​ వేళ మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు గట్టి షాక్‌ తగిలింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం..
  • మధ్యప్రదేశ్‌ (మొత్తం 230 స్థానాలు)లో బీజేపీ 18 చోట్ల గెలిచి.. మరో 139 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌ 7 చోట్ల గెలిచి.. మరో 65 చోట్ల ముందంజలో కొనసాగుతోంది. ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
  • రాజస్థాన్‌లో (మొత్తం 199 స్థానాలు) బీజేపీ 29 స్థానాల్లో విజయం కైవసం చేసుకుంది. మరో 84 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక, కాంగ్రెస్‌ 17 చోట్ల గెలిచి.. మరో 54 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు రెండు స్థానాల్లో గెలిచి.. మరో 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
  • ఛత్తీస్‌గఢ్‌లో (మొత్తం 90 స్థానాలు) బీజేపీ ఒక చోట గెలిచి.. మరో 53 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌ 34 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు రెండు చోట్ల ముందంజలో ఉన్నారు
  • 01.25 PM
    శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లో కమలం హవా కొనసాగుతోంది. ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు గట్టి షాక్‌ తగిలింది.
  • 12.44PM
    అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల సరళి ఆధారంగా మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ లో కాంగ్రెస్‌కు షాక్‌ తగిలేలా కన్పిస్తోంది. ఈ మూడు రాష్ట్రాల్లో ఆధిక్యంలో బీజేపీ దూకుడుగా కొనసాగుతోంది.
  • 11.10AM
    లీడింగ్​లోకి సచిన్ పైలట్
    టోంక్ స్థానం నుంచి సచిన్ పైలట్ లీడింగ్​లో ఉన్నారు. ప్రారంభంలో వెనుకబడ్డ ఆయన క్రమంగా పుంజుకున్నారు. తన సమీప అభ్యర్థి, బీజేపీ నేత అజిత్ సింగ్ మెహతాపై 3600 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు.
  • 11.05AM
    డిసెంబర్ 6న విపక్షాల సమావేశం
    4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జాతీయ స్థాయిలో విపక్ష నేతలు సమావేశానికి సిద్ధమవుతుండటం ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ 6న విపక్ష నేతలంతా దిల్లీలో సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తదుపరి వ్యూహాలపై సమావేశంలో చర్చించనున్నట్లు వెల్లడించాయి.
  • 11.00AM
    అంచనాలకు అందని ఛత్తీస్​గఢ్
    ఛత్తీస్​గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అందకుండా సాగుతున్నాయి. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్​దే విజయమని చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ, ప్రస్తుత సరళి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. బీజేపీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు, మధ్యప్రదేశ్​లో కమలదళం హవా కొనసాగుతోంది. రాజస్థాన్​లోనూ బీజేపీ మెజారిటీకి పైగా స్థానాల్లో లీడింగ్​లో ఉంది.
  • 10.25AM
    వసుంధరకు ఆధిక్యం
    ఝాల్​రాపాటన్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న రాజస్థాన్ బీజేపీ అగ్రనేత వసుంధర రాజె ఆధిక్యం కనబరుస్తున్నారు. ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి రామ్​లాల్ చౌహాన్​పై 11వేల ఓట్ల తేడాతో ముందున్నారు.
  • 9.50AM
    రాజస్థాన్​లో బీజేపీ అధికారం చేజిక్కించుకునే దిశగా సాగుతోంది. లీడింగ్​లో ఉన్న స్థానాల సంఖ్య వంద దాటింది. కాంగ్రెస్ 60కి పైగా స్థానాలతో కొనసాగుతోంది. ఇతరులు సుమారు 20 చోట్ల ఆధిక్యం కనబరుస్తున్నారు. ఛత్తీస్​గఢ్​లో హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఆధిక్యం ఇరుపార్టీల మధ్య దోబూచులాడుతోంది. మధ్పప్రదేశ్​లో మాత్రం వార్ వన్​సైడ్​గా సాగుతోంది.
  • 9.30AM
    ఛత్తీస్​గఢ్​లో అనూహ్యంగా బీజేపీ పుంజుకుంది. ఎగ్జిట్ పోల్స్​కు భిన్నంగా బీజేపీ గట్టిపోటీ ఇస్తోంది. కాంగ్రెస్​తో పోలిస్తే పలు స్థానాల్లో ముందంజలో ఉంది. మధ్యప్రదేశ్​లోనూ విశ్లేషకుల అంచనాలకు అందని విధంగా ఫలితాలు ఉన్నాయి. కాంగ్రెస్​కు అందనంత ఎత్తులో బీజేపీ లీడింగ్​లో ఉంది. రాజస్థాన్​లోనూ బీజేపీ హవా కనిపిస్తోంది. కాంగ్రెస్ సైతం గట్టిపోటీ ఇస్తున్నప్పటికీ ప్రస్తుతం వెనకంజలో కొనసాగుతోంది.
  • 9.10AM
    రాజస్థాన్​లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. మధ్యప్రదేశ్​లో బీజేపీ భారీ లీడింగ్​లో కొనసాగుతోంది. ఛత్తీస్​గఢ్​లో కాంగ్రెస్ ఆధిక్యానికి గండికొడుతూ బీజేపీ దూసుకొచ్చింది. ఇక్కడ సైతం టఫ్ ఫైట్ నడుస్తోంది.
  • 8.30AM
    రాజస్థాన్​లో బీజేపీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. 13 స్థానాల్లో బీజేపీ, 9 సీట్లలో కాంగ్రెస్ లీడింగ్​లో ఉన్నాయి. ఛత్తీస్​గఢ్​లో కాంగ్రెస్ పార్టీ 6 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. 2 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. మధ్యప్రదేశ్​లో బీజేపీ 11 సీట్లలో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ ఒ స్థానంలో లీడింగ్​లో ఉంది.
  • 8.00AM
    Assembly Election 2023 Live Updates In Telugu : మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్, రాజస్థాన్ శాసనసభలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా అధికారులు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారు. నవంబర్ 30న తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మధ్యప్రదేశ్​లో అధికార భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు తప్పదన్న అంచనాలతో ఆ రాష్ట్ర ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మధ్యప్రదేశ్ లో 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 116చోట్ల గెలిచిన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

ఛత్తీస్​గఢ్​లో 90 స్థానాలు ఉండగా ఇక్కడ కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందన్న ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయనేది ఆసక్తి మారింది. ఇక్కడ కాంగ్రెస్ అవలీలగా 46 సీట్ల మెజారిటీ మార్కును అందుకుని రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇక ప్రతిసారి అధికారాన్ని మార్చే... సంప్రదాయం ఉన్న రాజస్థాన్​లో ఈసారి కూడా అదే ఒరవడి కొనసాగే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. ఈసారి విపక్ష భాజపా అధికార కాంగ్రెస్​కు గట్టి పోటీ ఇస్తుందన్న అంచనాలతో ఫలితాలపై ఉత్కంఠ ఏర్పడింది. రాజస్థాన్​లో 200 స్థానాలు ఉండగా ఓ అభ్యర్థి మరణంతో 199 స్థానాలకే ఎన్నికలు నిర్వహించారు. ఈ పరిస్థితిలో వంద సీట్లు గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

Last Updated : Dec 3, 2023, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.