ETV Bharat / bharat

రెండు నెలలుగా కనిపించని అసోం మహిళ.. పాకిస్థాన్​ జైలులో ప్రత్యక్షం.. హైకోర్ట్​కు తల్లి! - కనిపించని అసోం మహిళ దిల్లీహైకోర్టు పిటిషన్

తన కుమారుడితో పాటు కనిపించకుండా పోయిన అసోం మహిళ.. పాకిస్థాన్​ జైలులో ప్రత్యక్షమయ్యింది. దీంతో తన కుమార్తెను, మనవడిని ఎలాగైనా భారత్​కు రప్పించాలని ఆమె తల్లి దిల్లీ హైకోర్టులో పిటిషన్​ వేసింది.

Assam Woman found in Pak Prison
Assam Woman found in Pak Prison
author img

By

Published : Jan 6, 2023, 11:55 AM IST

Updated : Jan 6, 2023, 12:14 PM IST

నవంబర్​ 2022 నుంచి తన కుమారుడితో పాటు కనిపించకుండా పోయిన అసోంకు చెందిన మహిళ పాకిస్థాన్​ జైల్​లో ప్రత్యక్షమయ్యింది. దీంతో ఆ మహిళ తల్లి.. తన కుమార్తెను ఎలాగైనా భారత్​కు రప్పించాలని దిల్లీ హైకోర్టులు పిటిషన్​ దాఖలు చేసింది.
అసలు ఏం జరిగిందంటే..
వాహిదా బేగం అనే మహిళ తన కుమారుడితో పాటు నాగాన్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో నివసిస్తోంది. ఆమె భర్త మహ్మద్​ మోసిన్​ చనిపోయాడు. అనంతరం ఆమె తన రూ. 1.60 కోట్ల విలువైన ఆస్తిని అమ్మింది. ఆ తర్వాత నవంబర్​ 10 నుంచి కుమారుడితో పాటు కనిపించడం లేదు. దీంతో ఆ మహిళ తల్లి అజిఫా ఖటూన్ నాగాన్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. కానీ పోలీసుల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

Assam Woman found in Pak Prison
కనిపించకుండా పోయిన మహిళ

ఇదిలా ఉండగా, నవంబర్​ 30న అజిఫాకు ఓ పాకిస్థాన్​ లాయర్​ నుంచి వాట్సాప్​ కాల్​ వచ్చింది. అందులో.. ఆమె కుమార్తె, మనవడు పాకిస్థాన్​ కెట్టా జిల్లా​ జైలులో ఉన్నారని తెలిపాడు. వాహిదా, పాకిస్థాన్​లోని ఇండియన్ రాయబార కార్యాలయానికి కూడా లీగల్​ నోటీసులు పంపిచానని చెప్పాడు. ఈ విషయం అజిఫా నాగాన్​ పోలీసులకు చెప్పింది. అయినా వారు పట్టించుకోలేదని ఆరోపించింది. కాగా, పోలీసులతో సమస్య పరిష్కారం కాదని.. తన కుమార్తె, మనవడిని భారత్​కు రప్పించాలని విదేశీ వ్యవహారాల శాఖ, పాక్​లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది. అయినా వారు స్పందించలేదు. దీంతో లాయర్​ సహాయంతో దిల్లీ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది. ఈ కేసు విచారణ శుక్రవారం జరగనుంది.

Last Updated : Jan 6, 2023, 12:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.