కాంగ్రెస్ పార్టీ మానసికంగా దివాలా తీసిందని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. శుక్రవారం అసోం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడ్డారు. ఎన్నికలకు ముందు ఆయా పార్టీలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
బంగాల్, కేరళ, అసోంలో ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళలో సీపీఎం-కాంగ్రెస్ ప్రత్యర్థులుగా ఉన్నాయి. కానీ బంగాల్, అసోంలో కలసి పోటీ చేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయి.
-జేపీ నడ్డా, భాజపా అధ్యక్షుడు
కాంగ్రెస్ 'రాజకీయ పర్యటనలు' చేస్తోందని నడ్డా ఎద్దేవా చేశారు. ఎన్నికలప్పుడు 'ఫొటో సెషన్స్' కోసం మాత్రమే ఆ పార్టీ వస్తుందని వ్యాఖ్యానించారు.
అసోం మూడో దశ(చివరి) ఎన్నికలు ఏప్రిల్ 6న జరగనున్నాయి. మే 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ఇవీ చదవండి: 'భాజపాకు అనుకూలంగా కేంద్ర బలగాల తీరు'