అసోంలో ఎన్నికల నియమావళి అమలైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ.110.83 కోట్లను సీజ్ చేసినట్లు ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి బుధవారం వెల్లడించారు. వీటిలో నగదు, విలువైన వస్తువులు సహా అక్రమ మద్యం ఉన్నాయని పేర్కొన్నారు.
పట్టుబడ్డ వాటిలో రూ.34.29 కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలు, రూ.33.44 కోట్లు విలువ చేసే మద్యం.. రూ.24.50 కోట్లు నగదు, రూ.3.68 కోట్లు విలువ చేసే బంగారం, వెండి సహా రూ.14.91 కోట్లు విలువ చేసే వస్తువులు ఉన్నట్లు సమాచారం.
'ఎన్నికల ఖర్చుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 50 కేసులు నమోదయ్యాయి. అక్రమ మద్యం తరలింపుపై 5,234 కేసులు నమోదయ్యాయి' అని ఎన్నికల కమిషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై ఆన్లైన్లో మార్చి 30 నాటికి 1,272 కేసులు నమోదు కాగా అందులో 908 కేసులు సరైన ఫిర్యాదులు అని తేలాయని పేర్కొంది.
ఇదీ చూడండి : బట్టలు ఇస్త్రీ చేసి ఓట్లు అభ్యర్థించిన మంత్రి