ETV Bharat / bharat

మరో సంకీర్ణ భాగస్వామికి భాజపా బైబై

అసోం బోడోల్యాండ్​ ప్రాదేశిక మండలి(బీటీసీ) ఎన్నికల ఫలితాల్లో హంగ్​ ఏర్పడిన వేళ.. కొత్త పొత్తులు పొడిచాయి. ప్రస్తుతం అక్కడ బోడో పీపుల్స్​ ఫ్రంట్​(బీపీఎఫ్​), భాజపా కూటమి అధికారంలో ఉన్నా.. బీపీఎఫ్​కు బై చెప్పి మరో పార్టీ యునైటెడ్​ పీపుల్స్​ పార్టీ లిబరల్​(యూపీపీఎల్​)ను కూటమిలో చేర్చుకుంటున్నట్లు ప్రకటించింది కమలదళం.

Assam polls: BJP dumps its coalition partner, picks up new ally
అసోం బీటీసీ పీఠం కోసం భాజపా కొత్త పొత్తు
author img

By

Published : Dec 13, 2020, 5:40 PM IST

అసోంలోని స్వయంప్రతిపత్తి ప్రాంతం బోడోల్యాండ్​ ప్రాదేశిక మండలి పీఠాన్ని.. ఈసారి భాజపా, యునైటెడ్​ పీపుల్స్​ పార్టీ లిబరల్​(యూపీపీఎల్​), గాన సురక్ష పార్టీ(జీఎస్​పీ) కూటమి అధిష్ఠించనుంది.

రాష్ట్రప్రభుత్వంలో భాగంగా ఉన్న బోడోల్యాండ్​ పీపుల్స్​ ఫ్రంట్​(బీపీఎఫ్​)ను భాజపా పక్కనపెట్టింది. కూటమిగా ఉన్న భాజపా, బీపీఎఫ్​ ఈసారి బీటీసీ ఎన్నికల్లో వేర్వేరుగా బరిలో నిలిచాయి. ప్రచారంలో ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నాయి. ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. 40 స్థానాలకు గానూ 17 చోట్ల గెలుపొంది బీపీఎఫ్​ అతిపెద్ద పార్టీగా అవతరించింది. యూపీపీఎల్​కు 12 దక్కగా.. కాంగ్రెస్​, జీఎస్​పీ తలో సీటు నెగ్గింది.

చివరిసారి భాజపాకు ఒకే సీటు దక్కగా ఈసారి ఏకంగా 9 చోట్ల గెలుపొందింది. అప్పుడే.. కొత్త కూటమిపై ఊహాగానాలు మొదలయ్యాయి.

ఇదీ చూడండి: 'బోడో' ఎన్నికల ఫలితాల్లో హంగ్- పుంజుకున్న భాజపా!

విజ్ఞప్తి చేసినా...

ఫలితాలు వెలువడిన అనంతరం.. కూటమి నిబంధనలు పాటించాలని భాజపాకు విజ్ఞప్తి చేశారు బీపీఎఫ్​ అధ్యక్షుడు, 17 ఏళ్లుగా బీటీసీ అధిపతిగా ఉన్న హగ్రామా మొహిలరీ. బీటీసీలో అధికారం చేపట్టేందుకు సహకరించాలని కోరారు. అయితే.. అవేమీ పట్టించుకోని భాజపా యూపీపీఎల్​ను అభినందిస్తూ, ఆ పార్టీని తన సంకీర్ణ భాగస్వామిగా పేర్కొంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​ షా ట్వీట్లు చేశారు.

assam-polls-bjp-dumps-its-coalition-partner-picks-up-new-ally
మోదీ ట్వీట్​

అమిత్​ షా ట్వీట్​

''ఈశాన్య ప్రజలకు సేవ చేసేందుకు ఎన్​డీఏ కట్టుబడి ఉంది. బీటీసీ ఎన్నికల్లో మెజార్టీ సాధించినందుకు మా సంకీర్ణ భాగస్వామి యూపీపీఎల్​, అసోం భాజపాకు అభినందనలు. వారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారు. ఎన్​డీఏపై విశ్వాసం ఉంచినందుకు అసోం ప్రజలకు కృతజ్ఞతలు.''

- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

సీఈఎంగా బోరో..

యూపీపీఎల్​ చీఫ్​ ప్రమోద్​ బోరో.. బీటీసీ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ మెంబర్​(సీఈఎం)గా ఉంటారని ప్రకటించారు ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్​. భాజపా, యూపీపీఎల్​, జీఎస్​పీ బీటీసీ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తాయని వెల్లడించారు.

2016 అసెంబ్లీ ఎన్నికల్లో.. భాజపా, బీపీఎఫ్​, ఏజీపీ కూటమిగా పోటీచేశాయి. అప్పుడు బీపీఎఫ్​ బరిలోకి దిగిన 12 స్థానాల్లోనూ గెలుపొందింది. ఆ పార్టీ నుంచి ముగ్గురు.. ప్రస్తుతం సోనోవాల్​ కేబినెట్​లో ఉన్నారు.

ఇటీవలి కాలంలో.. భాజపా తన సంకీర్ణ భాగస్వామితో తెగదెంపులు చేసుకోవడం ఇది రెండోసారి. 2018లో జమ్ముకశ్మీర్​లోని పీడీపీతో భాజపా బంధం తెంచుకుంది.

శివసేన, శిరోమణి అకాలీదళ్​.. ఎన్​డీఏ నుంచి బయటికొచ్చాయి.

ఇవీ చూడండి:

ఎన్డీఏతో అకాలీదళ్​ తెగదెంపులు-కూటమి నుంచి క్విట్​

చిరకాల మిత్రులతో విభేదాలు.. భాజపాకు నష్టమెంత?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.