ETV Bharat / bharat

సరిహద్దు వివాదాలపై అసోం, మేఘాలయ కీలక నిర్ణయం - అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ

సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం కమిటీలను ఏర్పాటు చేయాలని అసోం, మేఘాలయ రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. కేబినెట్​ మంత్రుల నేతృత్వంలోని ఈ కమిటీలు.. వివాదాలను పరిష్కరించే లక్ష్యంతో పని చేస్తాయని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలిపారు.

Assam, Meghalaya border issues
అసోం, మేఘాలయా సరిహద్దు సమస్యలు
author img

By

Published : Aug 6, 2021, 4:50 PM IST

అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదాలకు ముగింపు పలికే దిశగా అసోం, మేఘాలయ కీలక నిర్ణయం తీసుకున్నాయి. సరిహద్దు సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇరు రాష్ట్రాల ఆధ్వర్యంలో వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేస్తామని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్​ కె సంగ్మా శుక్రవారం తెలిపారు. ఈ కమిటీలకు ఆయా రాష్ట్రాలకు చెందిన కేబినెట్ ​మంత్రులు నేతృత్వం వహిస్తారని చెప్పారు. గువాహటిలో జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

ఐదుగురు సభ్యులతో..

ఈ కమిటీలు.. అసోం, మేఘాలయ మధ్య నెలకొన్న 12 వివాదాస్పద ప్రాంతాల్లో.. తొలుత ఆరింటి సమస్యను పరిష్కరించే లక్ష్యంతో పని చేస్తాయని విలేకరుల సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెల్లడించారు. ఈ కమిటీల్లోని ప్రతి ప్యానెల్​లో ఓ కేబినెట్​ మంత్రి సహా బ్యూరోక్రాట్లతో కలిపి మొత్తం ఐదుగురు సభ్యులు ఉంటారని హిమంత బిశ్వశర్మ తెలిపారు. ఇందులో స్థానిక ప్రతినిధులు కూడా ఉండొచ్చని చెప్పారు.

"ఈ కమిటీల్లోని సభ్యులు.. వివాదాస్పద ప్రాంతాలను సందర్శిస్తారు. అక్కడి పౌరులతో మాట్లాడుతారు. ఈ చర్చలను 30 రోజ్లులోగా పూర్తి చేస్తారు. చారిత్రక సాక్ష్యాధారాలు, సంప్రదాయాలు, పాలనావ్యవహారాలు, ప్రజల మనోభావాలు, ప్రాంతీయత అనే ఐదు అంశాల ఆధారంగా.. వివాదాలను పరిష్కరించేందుకు ఈ కమిటీలు ప్రయత్నిస్తాయి."

-కాన్రాడ్​ కె సంగ్మా, మేఘాలయ ముఖ్యమంత్రి

తారాబారి, గిజాంగ్​, ఫాలియా, బక్లపారా, పిలింగ్​కాటా, ఖానాపురు అనే ఆరు ప్రాంతాల్లో తొలుత ఈ కమిటీలు వివాదాలను పరిష్కరించనున్నాయి. ఈ ప్రాంతాలు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల పరిధిలో ఉన్నాయి.

ఇదీ చూడండి: అసోం, మిజోరం చర్చలు- వివాదం సద్దుమణిగేనా?

ఇదీ చూడండి: అసోం-నాగాలాండ్​ మధ్య ఫలించిన శాంతి చర్చలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.