అసోం వాసి.. ఐరోపాలోనే అత్యంత ఎత్తైన పర్వతమైన మౌంట్ ఎల్బ్రస్ను అధిరోహించాడు. చెపాన్ ఉన్నత పాఠశాలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు నబా కుమార్ ఫుకాన్.. ఈ ఘనత సాధించాడు. దీంతో అతణ్ని అందరూ ప్రశంసిస్తున్నారు.




రష్యాలో ఉండే ఈ మౌంట్ ఎల్బ్రస్ పర్వతం.. 5,742 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ పర్వత శిఖరం చేరుకున్న అనంతరం నబా కుమార్.. అసోం సంప్రదాయ కళ గముసాను గుర్తుకు తెచ్చే, ఖడ్గమృగాలను కాపాడాలనే సందేశాన్నిచ్చే ఓ పతాకాన్ని ఎగురవేశాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అసోం ముఖ్యమంత్రి హమంత బిశ్వ శర్మ ఫొటోలను ఆయన ప్రదర్శించాడు.
ఇదీ చూడండి: మెడలో సంచి వేసుకుని షాపింగ్ చేస్తున్న శునకం
ఇదీ చూడండి: 30 ఏళ్లు శ్రమించి ఊరికి రోడ్డేసిన అన్నదమ్ములు