ETV Bharat / bharat

కోర్టు నుంచి రేప్ కేసు నిందితుడు పరార్, కొట్టి చంపిన స్థానికులు - అసోంలో దారుణం

Mob lynching Assam: రెండు రోజుల క్రితం కోర్టు నుంచి తప్పించుకున్ననిందితుడ్ని దుండగులు కొట్టి చంపారు. ఈ ఘటన అసోంలో జరిగింది. నిందితుడిపై గత 15 ఏళ్లలో పలు పోలీస్​ స్టేషన్​లలో అత్యాచారం, దొంగతనం వంటి కేసులు నమోదయ్యాయి.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 18, 2022, 5:25 PM IST

Updated : Aug 18, 2022, 6:37 PM IST

Mob lynching Assam: అత్యాచారం, హత్య, దొంగతనం వంటి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని కొట్టి చంపారు కొందరు స్థానికులు. ఈ ఘటన అసోంలోని లఖింపుర్​లో గురువారం జరిగింది. రెండు రోజుల క్రితం గెర్జాయ్ బారువా అలియాస్ రాజు బారువా కోర్టు నుంచి తప్పించుకున్నాడు. అనంతరం అతడు ఘిలామార్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిలకిలి గ్రామంలోని ఓ వాగు వద్ద దాక్కున్నాడు. దీంతో కొంత మంది కలిసి అతడిపై దాడి చేసి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు బారువాపై దాడి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే కొందరు నిందితుడ్ని చితకబాదారు. తీవ్రంగా గాయపడిన నిందితుడ్ని.. స్థానికుల నుంచి కాపాడే ప్రయత్నం చేశారు పోలీసులు. ఆవేశంతో ఉన్న వారు.. ఇద్దరు పోలీసులపై కూడా దాడికి పాల్పడ్డారు.

నిందితుడు రాజు బారువాను ధాకుఖానా సివిల్ ఆసుపత్రికి తరలించాం. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. స్థానికుల దాడిలో గాయపడిన ఇద్దరు పోలీసులను మెరుగైన చికిత్స కోసం లఖింపుర్​ తరలించాం. నిందితుడిపై గత 15 ఏళ్లుగా దొంగతనం, దోపీడీ, అత్యాచారం, హత్య కేసులు పలు పోలీస్ స్టేషన్​లలో నమోదయ్యాయి. బారువాతో పాటు మరో ఇద్దరు నిందితులు మంగళవారం ధాకుఖానా కోర్టు నుంచి తప్పించుకున్నారు. వారి కోసం ముమ్మరంగా గాలించి ఒకరిని అరెస్టు చేశాం. మరొకరి కోసం వెతుకుతున్నాం.

--పోలీసులు

బారువా మరణ వార్త విని ధాకుఖానా ఆసుపత్రి వద్ద అతడి మృతదేహాన్ని చూసేందుకు జనాలు గుమిగూడారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతేడాది సెప్టెంబరులో బారువా పోలీసుల ఎన్​కౌంటర్​లో గాయపడ్డాడు.

ఇవీ చదవండి: డోలో 650 ప్రిస్క్రైబ్ చేసేందుకు వారికి రూ.వెయ్యి కోట్ల గిఫ్ట్స్​, సుప్రీం సీరియస్

బీచ్​లో అనుమానిత బోటు, లోపల ఏకే47 గన్స్, అసలేమైంది

Last Updated : Aug 18, 2022, 6:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.