ETV Bharat / bharat

నిక్కర్ వేసుకుందని ఎగ్జామ్​ హాల్​కు నో ఎంట్రీ.. కర్టెన్​నే​ చుట్టుకొని! - అసోం తేజ్​పుర్ న్యూస్

నిక్కర్ వేసుకుని వచ్చిందనే కారణంతో ఓ యువతిని(Assam Girl News) పరీక్ష హాల్​లోకి అనుమతించలేదు అధికారులు. చాలా సేపు బయటే వేచి చూసిన తర్వాత తన తండ్రి తెచ్చిన ఓ కర్టెన్​ వేసుకుని పరీక్ష రాసేందుకు లోనికి వెళ్లింది. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Assam Girl News
నిక్కర్ వేసుకుందని ఎగ్జామ్​ హాల్​లోకి నో ఎంట్రీ
author img

By

Published : Sep 17, 2021, 11:56 AM IST

Updated : Sep 17, 2021, 2:04 PM IST

పరీక్ష రాసేందుకు పొట్టి దుస్తులు(నిక్కర్​) (Assam Girl News) వేసుకొచ్చిందనే కారణంతో ఓ యువతిని ఎగ్జామ్​ హాల్​లోకి అనుమతించలేదు అధికారులు. చాలా సేపు బయటే నిలిపేశారు. అసోం తేజ్​పుర్​లో(Tezpur Girl News) ఇటీవలే ఈ ఘటన జరిగింది. అసోం అగ్రికల్చర్​ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష రాసేందుకు ఆ యువతి (Assam Girl News) వెళ్లింది.

ఎగ్జామ్​కు హాజరయ్యేందుకు అవసరమైన అన్నీ పత్రాలు తీసుకెళ్లినప్పటికీ సిబ్బంది తనను హాల్​లోకి వెళ్లనివ్వలేదని యువతి తెలిపింది. ఎందుకు అని ప్రశ్నిస్తే నిక్కర్ వేసుకొని పరీక్ష రాయడానికి వీల్లేదని బదులిచ్చినట్లు పేర్కొంది. అడ్మిట్ కార్డులో అలాంటి నిబంధనేమీ లేదని, అయినా వారు తనను అనుమతించలేదని వాపోయింది.

Assam Girl News, Assam Girl
నిక్కర్ వేసుకుందని ఎగ్జామ్​ హాల్​లోకి నో ఎంట్రీ

అయితే సిబ్బంది మాత్రం అమ్మాయి ప్రవర్తనను(Assam Tezpur News Today) తప్పుబట్టారు. పరీక్ష రాసేందుకు నిక్కర్లు వేసుకురావొద్దనే నిబంధన లేకపోయినప్పటికీ సరైన దుస్తులతో రావాలనే కామన్ సెన్స్ వారికి ఉండాలని అసహనం వ్యక్తం చేశారు.

తండ్రి వచ్చాక..

యువతి చాలా సేపు పరీక్ష హాల్ బయట వేచి చూసిన తర్వాత తన తండ్రి తెచ్చిన ఓ కర్టెన్​ను నిక్కర్​పై చుట్టుకుని హాల్​లోకి వెళ్లింది. చివరకు ఎలాగోలా పరీక్ష రాసింది.

ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పౌరుల స్వేచ్ఛకు విరుద్ధంగా ఆ విద్యాసంస్థ వ్యవహరించిందని పలువురు విమర్శించారు. ఎలాంటి దుస్తులు వేసుకొస్తే ఏంటని మండిపడ్డారు. మరికొందరు మాత్రం అమ్మాయి ఇలాంటి దుస్తులతో వెళ్లడం తగదని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: Modi Birthday Celebrations: 71 అడుగుల కేక్​.. 71 కిలోల లడ్డూ

Last Updated : Sep 17, 2021, 2:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.