ETV Bharat / bharat

'టీకా తీసుకుంటేనే ఉద్యోగులకు ఈ నెల జీతం!'

టీకాకు, నెల జీతానికి ముడి పెడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులపై అసోం ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీకా తీసుకోవడం అనేది స్వచ్ఛందంగా జరగాలని, ఒకరు ఒత్తిడి చేయకూడదని అంటున్నారు.

vaccine, assam
వ్యాక్సిన్, అసోం
author img

By

Published : Jun 25, 2021, 3:57 PM IST

అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిష్ణు బారువా ఇటీవల జారీ చేసిన ఆదేశాలపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల జీతం ఇచ్చేముందు ప్రభుత్వ ఉద్యోగులందరి వ్యాక్సినేషన్ స్టేటస్​ను చూడాలని వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులను ఆదేశించారు జిష్ణు. ఇలా చేయడాన్ని ఉద్యోగులు తప్పుబడుతున్నారు.

టీకా తీసుకోవడం అనేది స్వచ్ఛందంగా జరగాలని, ఒకరు బలవంతం చేయరాదని గతంలో సుప్రీం కోర్టు, దిల్లీ, కేరళ హైకోర్టులు తీర్పు వెలువరించాయి. ఈ నేపథ్యంలో.. టీకా తీసుకున్నవారికే నెలజీతం ఇవ్వాలని ఆదేశించిన చీఫ్​ సెక్రటరీపై విమర్శలు వెల్లువెత్తాయి.

"టీకా విషయంలో ప్రధాన కార్యదర్శి ఇలాంటి ఆదేశాలు ఎలా ఇస్తారు? ఇది గతంలో కోర్టులు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించడమే అవుతుంది."

--ఉద్యోగుల సంఘం.

స్వచ్ఛందమే..

కొవిడ్​ టీకా తీసుకునే ప్రక్రియ స్వచ్ఛందంగానే జరగాలని కేంద్ర ఆరోగ్య శాఖ వైరస్​ మొదటి దశ వ్యాప్తి సమయంలోనే పేర్కొంది. అయితే.. వైరస్​ నుంచి రక్షణ పొందేందుకు అందరూ టీకా తీసుకోవడం మంచిదని కోరింది.

ఇదీ చదవండి:ఇద్దరు పిల్లల విధానంపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.