అసోం పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. బుధవారం గువాహటిలోని కామాఖ్య ఆలయాన్ని సందర్శించారు. మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు.


అసోం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా.. తాము ఇచ్చిన ఐదు హామీలను తప్పకుండా నెరవేరుస్తామని రాహుల్ స్పష్టం చేశారు. తమది భారతీయ జనతా పార్టీ కాదని.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు. తేయాకు కార్మికులకు రోజూ వారీ వేతనం రూ.365 చెల్లిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి: బంగాల్, అసోం రెండో దశ ఎన్నికల ప్రచారానికి తెర