భారతదేశపు తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి, తమిళనాడులోని రామేశ్వరంలోని 'న్యూ పంబన్ బ్రిడ్జి' ని (New Pamban Bridge) 2022 మార్చి నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేలా కృషి చేస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కొత్త పంబన్ బ్రిడ్జి నిర్మాణపనుల చిత్రాలను ట్విట్టర్లో షేర్ చేశారు.
-
New Pamban Bridge, India’s first vertical lift Railway sea bridge.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Target #Infra4India March 2022. pic.twitter.com/8HnqnIFW3W
">New Pamban Bridge, India’s first vertical lift Railway sea bridge.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 6, 2021
Target #Infra4India March 2022. pic.twitter.com/8HnqnIFW3WNew Pamban Bridge, India’s first vertical lift Railway sea bridge.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 6, 2021
Target #Infra4India March 2022. pic.twitter.com/8HnqnIFW3W
మార్చి 2019లో ఈ కొత్త పంబన్ బ్రిడ్జికి (Pamban Bridge) ప్రధాని నరేంద్ర మోదీ (Pm Modi News) పునాదిరాయి వేయగా.. ఈ బ్రిడ్జి నిర్మాణపనులు 2019 నవంబరు 9న ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్మాణానికి సుమారు రూ.250కోట్లు వెచ్చింది. 104ఏళ్ల చరిత్ర గల ఈ బ్రిడ్జి.. బంగాళాఖాతంలోని పంబన్ దీవికి, దేశానికి అనుసంధానంగా ఉంటుంది. 63మీట్లరు పొడవుగా ఉండి పడవలు, ఓడలు వెళ్లే సమయంలో పైకి లిఫ్ట్ చేసే విధంగా ఏర్పాటు చేశారు.
పూర్తిస్థాయిలో ఇది అందుబాటులోకి వస్తే.. రామేశ్వరానికి (Rameswaram Bridge) రైళ్లను అధికవేగంతో నడిపేందుకు.. అలాగే అధిక బరువు ఉన్నలోడ్‌ను తీసుకెళ్లేందుకు సహాయపడుతుంది. కాగా పాత పంబన్ బ్రిడ్జిని 1914లో అందుబాటులోకి తీసుకురాగా... ఆ బ్రిడ్జి నిర్మాణం మూడేళ్లలో పూర్తిచేశారు.
ఇదీ చూడండి: పొరపాటున కన్నబిడ్డనే కాల్చి చంపిన తండ్రి.. ప్రాయశ్చిత్తంగా...