ETV Bharat / bharat

'ఒకప్పుడు గాంధీని హత్యచేసినవారే ఇప్పుడు నాపై దాడి చేశారు' - UP Election Owaisi

Asaduddin Owaisi news: అప్పట్లో మహాత్మా గాంధీని చంపినవారే నేడు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ. తనపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయని.. కానీ అల్లా నన్ను రక్షించాడని పేర్కొన్నారు.

Asaduddin Owaisi
Asaduddin Owaisi
author img

By

Published : Feb 6, 2022, 6:13 AM IST

Asaduddin Owaisi news: ఎన్నికల వేళ ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వాహనంపై కాల్పులు జరిగిన నేపథ్యంలో తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై వాహనంపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిగినట్లు అసదుద్దీన్‌ తెలిపారు. ఈ ఘటన నుంచి సురక్షితంగా బయటపడిన ఆయన శనివారం భాగ్‌పత్‌ జిల్లా ఛప్రౌలిలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. కాల్పుల ఘటన తర్వాత మొదటిసారి ఓ ర్యాలీలో భాగమయ్యారు. ఈ సందర్భంగా దాడి గురించి మాట్లాడారు. అప్పట్లో మహాత్మా గాంధీని చంపినవారే నేడు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు.

'ఒకప్పుడు గాంధీని హత్యచేసినవారే నేడు నాపై దాడికి పాల్పడ్డారు' అంటూ ఒవైసీ పేర్కొన్నారు. ఈ దాడికి సంబంధించి ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. వారికి భాజపాతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 'నాపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయి. కానీ అల్లా నన్ను రక్షించాడు' అని తెలిపారు.

యూపీలోని మేరఠ్ జిల్లా కితౌర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని దిల్లీకి వెళ్తుండగా ఛాజర్సీ టోల్‌ప్లాజా వద్ద అసదుద్దీన్‌పై కాల్పులు జరిగాయి. అనంతరం షూటర్లు ఆయుధాలను అక్కడే వదిలేసి పరారయ్యారని పేర్కొన్నారు. తామంతా సురక్షితంగా బయటపడినట్టు అసదుద్దీన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం కేంద్ర ప్రభుత్వం ఒవైసీకి ‘జడ్‌’ కేటగిరీ భద్రతను కల్పించగా దాన్ని ఆయన తిరస్కరించారు. తాను స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నానని.. ఆంక్షల మధ్య కాదని పేర్కొన్నారు. తనపై కాల్పులు జరిపిన వ్యక్తులు, వారిని ఉసిగొల్పిన వారిపై ఉపా చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చూడండి: కేంద్రం కీలక నిర్ణయం- 'ఒవైసీ'కి జెడ్​ కేటగిరీ భద్రత!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.