Asaduddin Owaisi Rejects Z Category: తనకు జడ్ కేటగిరీ భద్రత వద్దని చెప్పారు హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. దీనికి బదులుగా దేశంలో మతసామరస్యాన్ని పునరుద్ధరించాలని లోక్సభ స్పీకర్ ఓంబిర్లాను అడిగారు. కాల్పులు జరిపిన వారిని చూసి భయపడట్లేదని అన్నారు. యూపీ ఎన్నికల ప్రచారం సమయంలో గురువారం.. ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో.. ఆయనకు జడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించగా దానిని ఒవైసీ తిరస్కరించారు.
''నాకు జడ్ కేటగిరీ భద్రత అవసరం లేదు. నాపై కాల్పులు జరిపితే.. నేను ఆ బుల్లెట్లను స్వీకరిస్తా. దేశంలో పేదలు బతికితేనే నేనూ బతుకుతాను. బదులుగా ఈ విద్వేషవ్యాప్తిని ఆపమని మిమ్మల్ని వేడుకుంటున్నా.''
- అసదుద్దీన్ ఒవైసీ, ఎంపీ
ఇలా జరిగినంత మాత్రాన.. తన ట్రాక్ నుంచి పక్కకు తప్పుకోనని, ఉత్తర్ప్రదేశ్ ప్రజలే బ్యాలెట్ ద్వారా వారికి తగిన సమాధానం చెప్తారని అన్నారు.
అసదుద్దీన్ ఒవైసీ కాల్పుల ఘటనపై ఫిబ్రవరి 7న పార్లమెంటులో సమగ్ర వివరణ ఇవ్వనున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.
ఇవీ చూడండి: అసదుద్దీన్ ఒవైసీ కారుపై దాడి- తుపాకులతో దుండగుల బీభత్సం!