ETV Bharat / bharat

ఆన్​లైన్​లో కత్తుల కోసం ఆర్డర్లు- ఆందోళనలో పోలీసులు - stabbing incidents rise

ఛత్తీస్​గఢ్​ రాజధానిలో కత్తిపోటు ఘటనలు పెరుగుతున్న తరుణంలో వినియోగదారులకు కత్తులు డెలివరీ చేయవద్దని ఈ-కామర్స్ సంస్థలను కోరారు పోలీసులు. గతేడాది 800 కత్తులను వినియోగదారులు ఆర్డర్ చేశారని.. వీటికి నగరంలో జరిగిన కొన్ని కేసులకు సంబంధాలున్నాయని అధికారులు చెబుతున్నారు.

As stabbing incidents rise in Raipur, over 800 knives ordred by people in 2020: Police
ఆన్​లైన్​లో కత్తులు ఆర్డర్లు- ఆ నగరంలో పెరుగుతున్న నేరాలు!
author img

By

Published : Mar 24, 2021, 11:02 AM IST

Updated : Mar 24, 2021, 12:14 PM IST

ఆన్​లైన్​లో వినియోగాదారులు ఆర్డర్​ చేసిన కత్తులను డెలివరీ చేయొద్దని అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​ వంటి ఈ-కామర్స్​ సంస్థలను కోరారు ఛత్తీస్​గఢ్​ పోలీసులు. రాష్ట్ర రాజధాని రాయ్​పుర్​లో కత్తిపోటు ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.

గత కొన్ని నెలలుగా కత్తిపోటు ఘటనలు, మరణాలు పెరిగాయని.. ఈ కేసులకు ఆన్​లైన్​లో కొనుగోలు చేసిన కత్తులతో సంబంధాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే పలువురి నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిలో ఎక్కువగా మైనర్లే ఉన్నట్లు చెప్పారు.

"రాజధాని నగరంలో పెరుగుతున్న కత్తిపోటు ఘటనలను దృష్టిలో ఉంచుకుని రాయ్​పుర్​ పోలీసులు ఓ ప్రచారాన్ని ప్రారంభించారు. గతేడాది కత్తులను ఆర్డర్​ చేసిన వ్యక్తుల కోసం ఫ్లిప్‌కార్ట్​, అమెజాన్​ వంటి ఆన్‌లైన్​ ఈ-కామర్స్​ సంస్థల నుంచి డేటాను పోలీసులు సేకరించారు. ఈ జాబితా ఆధారంగా 2020లో 800 మంది కత్తులు ఆర్డర్​ చేసినట్లు తేలింది. వీటిలో రాయ్​పుర్​ నుంచి 502, ఇతర జిల్లాల నుంచి 298 ఆర్డర్లు వచ్చినట్లు తెలిసింది."

- ఛత్తీస్​గఢ్​ పోలీసులు

ఇదీ చూడండి: ఇంట్లో మూడు అస్థిపంజరాలు- ఎవరివి?

Last Updated : Mar 24, 2021, 12:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.