కేరళ కోజీకోడ్ బీచ్‌లో సోమవారం అష్రఫ్ అనే పేరుగల 2,537 మంది సమావేశమై ప్రపంచ రికార్డు సృష్టించారు. 14 జిల్లాలకు చెందిన సుమారు 3 సంవత్సరాల వయసు నుంచి 80 వయసు మధ్య గల అష్రఫ్ అనే పేరు గల వ్యక్తులు సమావేశమయ్యారు. అనంతరం అష్రఫ్ పేరు ఆకారంలో నిలబడ్డారు. దీనికి గాను 'లార్జెస్ట్ సేమ్ నేమ్ గ్యాథరింగ్' యూఆర్ఎఫ్ రికార్డును సాధించారు. అంతకుముందు ఈ రికార్డు కుబ్రోస్కీ అనే పేరుపై ఉంది. 2,325 మంది కలిసి ఒకేచోట చేరారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి అహ్మద్ దేవర్కోవిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొత్తం 3,000 మంది అష్రఫ్‌లు సమావేశం కావాలని నిర్ణయించగా.. 2,537 మంది కలిశారు. అనంతరం వీరందరూ 'డ్రగ్ ఫ్రీ కేరళ' కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకే సమావేశమయ్యారు.
జూన్ 2018లో మలప్పురం జిల్లాలోని కుట్టిల్లో తొలిసారి నలుగురు అష్రఫ్ పేరున్న వ్యక్తులు అనుకోకుండా కలిశారు. అనంతరం ఓ టీ షాప్‌నకు వెళ్లగా.. అక్కడ యజమాని పేరు సైతం అష్రఫే. దీంతో అక్కడే కూర్చున్న ఓ వ్యక్తి అష్రఫ్‌ల సమావేశమా అని ప్రశ్నించాడు. ఆ ఆలోచనతో మొదలై.. ఓ కమిటీని రూపొందించి అంతిమంగా అష్రఫ్ సంగమాన్ని ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి: స్నాక్స్‌లో మత్తుమందు కలిపిన నవవధువు.. భర్త, అత్తమామలు స్పృహ తప్పాక పరార్!
'ఐదేళ్లుగా ఫోన్‌కు దూరం.. అందుకే 100% స్కోర్!'.. సక్సెస్ సీక్రెట్ చెప్పిన జేఈఈ టాపర్