ETV Bharat / bharat

గుజరాత్​పై ఆప్​ గురి- అన్ని స్థానాల్లో పోటీ

గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లలో ఆమ్ ​ఆద్మీ పార్టీ బరిలో నిలుస్తుందని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. రాష్ట్రంలో భాజపాకు ప్రత్యామ్నాయం తామే అని విశ్వాసం వ్యక్తంచేశారు.

gujarat assembly election
అరవింద్ కేజ్రీవాల్
author img

By

Published : Jun 14, 2021, 12:48 PM IST

Updated : Jun 14, 2021, 1:53 PM IST

వచ్చే ఏడాది గుజరాత్​లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేయనున్నట్లు ఆమ్​ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. రాష్ట్రంలో అధికార భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్​లకు సరైన ప్రత్యామ్నాయం.. ఆప్ అని వెల్లడించారు. అహ్మదాబాద్​లో సోమవారం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

gujarat assembly election
అరవింద్ కేజ్రీవాల్

"దిల్లీలో విద్యుత్ ఉచితంగా ఇస్తుంటే గుజరాత్​లో మాత్రం ఎందుకివ్వరని ఇక్కడి ప్రజలు ఆలోచిస్తున్నారు. 70ఏళ్లలో ఆస్పత్రుల పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. కానీ మార్పు ఇప్పుడు మొదలవుతుంది."

- అరవింద్ కేజ్రీవాల్, ఆప్ అధినేత.

182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్​లో వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చూడండి: 'పిజ్జాలే ఇస్తుంటే.. ఇంటికే రేషన్​ ఎందుకొద్దు?'

Last Updated : Jun 14, 2021, 1:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.