ETV Bharat / bharat

హిమపాతంలో గల్లంతైన ఏడుగురు జవాన్లు మృతి - హిమపాతం అరుణాచల్ ప్రదేశ్ సైనికులు మృతి

Arunachal Pradesh Army Avalanche: అరుణాచల్​ప్రదేశ్​లో హిమపాతంలో చిక్కుకొని గల్లంతైన ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఈ ఘటన జరగ్గా.. మంగళవారం మృతదేహాలు లభించాయని భారత సైన్యం తన ప్రకటనలో తెలిపింది.

Arunachal Pradesh Army Avalanche
Arunachal Pradesh Army Avalanche
author img

By

Published : Feb 8, 2022, 5:07 PM IST

Arunachal Pradesh Army Avalanche: అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఆకస్మిక హిమపాతంలో చిక్కుకొని గల్లంతైన ఏడుగురు సైనికులు మరణించినట్లు భారత సైన్యం నిర్ధరించింది. ఘటన జరిగిన కమెంగ్ సెక్టార్​ నుంచి వీరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.

రాష్ట్రంలోని ఎత్తైన ప్రాంతమైన కమెంగ్‌ సెక్టార్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది. సైనికులు పెట్రోలింగ్‌ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో హిమపాతం సంభవించిందని.. అందులోనే సైనికులు చిక్కుకుపోయారని అధికారులు సోమవారం ప్రకటన విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో భారీగా మంచు కురుస్తున్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు.

సమాచారం తెలియగానే రెస్క్యూ సిబ్బందిని రంగంలోకి దించి.. వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టామని అధికారులు తెలిపారు. తాజాగా వారి మృతదేహాలను గుర్తించినట్లు వివరించారు.

ఇదీ చదవండి: ముదిరిన హిజాబ్​ వివాదం.. మూడు రోజులు విద్యాసంస్థలు బంద్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.