ETV Bharat / bharat

ఇంట్లో ఒంటరిగా ఉన్న తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం - కన్నౌజ్​ న్యూస్​

తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు ఇటుక బట్టీలో పనిచేసే ఓ యువకుడు. ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ బిజ్నోర్​లో జరిగింది. మరో ఘటనలో అత్యాచార కేసు నిందితుడు జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు.

Uttarpradesh news
Uttarpradesh news
author img

By

Published : May 2, 2022, 10:13 PM IST

Arrested Person Hanged In jail: ఉత్తర్​ప్రదేశ్​ కన్నౌజ్​ జైలులో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడు దళిత బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ రాకేష్ కుమార్ మిశ్రా విచారణకు ఆదేశించినట్లు అధికారి తెలిపారు. దీంతో డీఎం మిశ్రా, పోలీస్ సూపరింటెండెంట్ ప్రశాంత్ వర్మ జైలును సందర్శించి విచారణ చేపట్టారు.

కన్నౌజ్​లోని ఓ గ్రామానికి చెందిన బాలిక.. 21 ఏళ్ల యువకుడు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు కేసు పెట్టింది. దీంతో అతడిని మార్చి 24న అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం నీటి పైప్​లైన్​కు కండువాతో ఉరివేసుకున్నట్లు జైలు సూపరింటెండెంట్ ​ విష్ణుకాంత్​ మిశ్రా తెలిపారు. పెళ్లి సాకుతో తనపై అత్యాచారం చేశాడని బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది.

Minor Rape In Uttarpradesh: ఉత్తర్​ప్రదేశ్​ బిజ్నోర్​లో దారుణం జరిగింది. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు ఓ యువకుడు. దీంతో నిందితుడిపై పోక్సో చట్టంతో సహా పలు సెక్షన్ల కింద కేసులు పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని ఇటుకల బట్టీలో పనిచేసే కార్మికుడిగా గుర్తించారు.

బాలిక తల్లిదండ్రులు శివాలకల కలాన్​లో ఓ ఇటుక బట్టీలో పనిచేస్తుంటారు. రోజులాగే సోమవారం ఉదయమే బాలిక తల్లిదండ్రులు పనికి వెళ్లిపోయారు. దీంతో ఇంట్లో బాలిక ఒంటరిగా ఉంది. ఈ క్రమంలోనే అదనుచూసి యువకుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

ఇదీ చదవండి: 'నా అరెస్ట్​ కోసం ప్రధాని కార్యాలయం కుట్ర.. 56 అంగుళాల పిరికితనం!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.