ETV Bharat / bharat

'మేమూ మోదీని ప్రశ్నిస్తాం.. అరెస్టు చేయండి' - మోదీపై పోస్టర్లు

వ్యాక్సిన్​ విషయంలో ప్రధాన మంత్రిని విమర్శించిన కొంతమందిపై దిల్లీ పోలీసులు చర్యలు తీసుకోవడాన్ని కాంగ్రెస్​ తప్పుబట్టింది. తమను కూడా ఈ విషయంలో అరెస్టు చేయాలని సవాలు విసిరింది. టీకాలను విదేశాలకు ఎందుకు ఎగుమతి చేశారని మోదీని ప్రశ్నించింది.

రాహుల్​ గాంధీ
రాహుల్​ గాంధీ
author img

By

Published : May 16, 2021, 5:46 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శిస్తూ పోస్టర్లు వేశారనే ఆరోపణలతో కొంతమందిపై దిల్లీ పోలీసులు చర్యలు తీసుకోవడంపై కాంగ్రెస్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యాక్సిన్లపై ప్రశ్నలు అడుగుతున్నందున తమను కూడా అరెస్టు చేయాలని సవాలు విసిరింది. ఈ మేరకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీ.. ట్విట్టర్​లో ప్రొఫైల్​ చిత్రం మార్చారు.

"మోదీజీ మా పిల్లల టీకాలను విదేశాలకు ఎందుకు పంపించారు?" అనే ఫొటోను షేర్​ చేసిన రాహుల్​ గాంధీ.. తనను కూడా అరెస్టు చేయాలని సవాలు విసిరారు.

నన్ను అరెస్టు చేయండి..

"ప్రధాన మంత్రిని విమర్శిస్తూ పోస్టర్లు ప్రదర్శించడం ఇప్పుడు నేరమా? భారత్​లో మోదీ పీనల్​ కోడ్​ అమల్లో ఉందా? కొవిడ్​ మహమ్మారి విజృంభణ వల్ల దిల్లీ పోలీసులకు పనిలేకుండా పోయింది. నేను రేపు నా ఇంటి గోడ మీద పోస్టర్లు అంటిస్తాను. రండి నన్ను అరెస్టు చేయండి." అని కాంగ్రెస్​ సీనియర్​ నేత జైరాం రమేష్​ విమర్శించారు.

ప్రశ్నలు వస్తూనే ఉంటాయి..

దేశంలో ప్రజలకు వ్యాక్సిన్లు అందుబాటులో లేనప్పుడు ప్రశ్నలు పస్తూనే ఉంటాయని విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్​ ఖేరా పేర్కొన్నారు.

"ధైర్యం ఉంటే నన్ను అరెస్టు చేయండి. నా వ్యాక్సిన్​ ఎక్కడ? నా ఆక్సిజన్​ ఎక్కడ? మేం ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం. కరోనా సంక్షోభాన్ని ప్రభుత్వం సరిగా ఎదుర్కోలేకపోయింది."

-పవన్​ ఖేరా, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి

గతంలో భారత్​లో పోలియో వంటి ఎన్నో టీకా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాయని పవన్​ ఖేరా అన్నారు. కానీ, ప్రధాని మోదీ హయాంలో కొవిడ్​ టీకా పంపిణీ సరైన విధంగా కొనసాగలేదని ఎద్దేవా చేశారు.

ఇదీ చూడండి: 'తౌక్టే' బీభత్సం- కర్ణాటకలో నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.