పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో సరిహద్దు వెంబడి ఒక్కో లాంచింగ్ ప్యాడ్ వద్ద 250 నుంచి 300 మంది వరకు ఉగ్రవాదులు భారత్‌లో చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని కశ్మీర్ బీఎస్‌ఎఫ్ ఐజీ రాజేశ్ మిశ్రా తెలిపారు. ఉగ్రవాదుల చొరబాట్లను భద్రతా బలగాలు సమర్థవంతంగా అడ్డుకోగలిగాయన్నారు.
ఇటీవల పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి ఉల్లంఘిస్తూ దాడి చేసిన ఘటనలో అధిక సంఖ్య ప్రజలు గాయపడ్డారని, పెద్ద మెుత్తంలో వారి ఆస్తులు దెబ్బతిన్నాయని ఐజీ వెల్లడించారు. ఈ విషయాన్ని మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్తామని రాజేశ్ మిశ్రా తెలిపారు.