పుణెలోని ఆర్డ్మ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్‌లో(ఏఎఫ్‌ఎమ్‌సీ) పోస్టింగ్ పొందిన ఓ ఆర్మీ జవాన్‌ను అరెస్టు చేశారు పోలీసులు. పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తితో రహస్య సమాచారం పంచుకున్నట్లు తెలిసిన కారణంగా అతడిని పట్నా దానాపుర్ పోలీసులు(patna news today) అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆ జవాన్‌పై అధికార రహస్యాల చట్టం(ఒఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్) కింద కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి పేర్కొన్నారు.
"పుణెలో పోస్టింగ్ పొందిన ఆర్మీ అధికారి పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తితో రహస్య సమాచారం పంచుకున్నట్లు సమాచారం అందింది. తమ ఆర్మీ యూనిట్‌కు సంబంధించిన విషయాలు కూడా పాక్ వ్యక్తితో పంచుకున్నట్లు తెలిసింది." అని దానాపుర్ ఏఎస్పీ సయ్యద్ ఇమ్రాన్ మసూద్ తెలిపారు.
అధికారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభినట్లు మసూద్ పేర్కొన్నారు. సెల్ ఫోన్ డేటాను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: