ETV Bharat / bharat

తల్లీబిడ్డలను మోస్తూ మంచులో 3.5కి.మీ నడక

భారత సైన్యం మరోసారి మానవత్వం చాటుకుంది. కశ్మీర్​లో ఓ బాలింతను స్ట్రెచర్​పై 3.5 కి.మీ మోస్తూ ఇంటికి చేర్చారు జవాన్లు.

Army personnel in Sopore carried a woman and her newborn on a stretcher in Jammu Kashmir
తల్లీబిడ్డలను స్ట్రెచర్​పై మోసి.. ఇంటికి చేర్చిన జవాన్లు
author img

By

Published : Jan 8, 2021, 1:31 PM IST

కశ్మీర్​లో హిమపాతం కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. రహదారులపై భారీగా మంచు పేరుకుపోయి వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో ఇటీవల ప్రసవమైన ఓ మహిళ, ఆమె బిడ్డను.. జవాన్లు స్ట్రెచర్​పై మోస్తూ కాలినడక ప్రయాణంతో క్షేమంగా ఇంటికి చేర్చారు. సోపోర్​ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

Army personnel in Sopore carried a woman and her newborn on a stretcher in Jammu Kashmir
మంచు దుప్పట్లో బాలింతను స్ట్రెచర్​పై మోస్తూ...

తల్లీబిడ్డలను మోసుకుంటూ పజల్​పొరా నుంచి దునివార్​​కు సుమారు 3.5 కిలోమీటర్లు నడిచాయి భద్రతా బలగాలు. మంచులో కూరుకుపోయిన రహదారిపై సైనికులు నడుస్తుండగా.. స్థానికులు, ఆసుపత్రి సిబ్బంది వారికి సహకారమందించారు.

ఇదీ చదవండి: కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.