ETV Bharat / bharat

'నా భార్యపై 120 మంది దాడి చేశారు.. అర్ధనగ్నంగా చేసి, దారుణంగా కొట్టారు': ఆర్మీ జవాన్​ వీడియో - ఆర్మీ జవాన్ భార్యపై దుండగుల దాడి

తమిళనాడుకు చెందిన ఓ ఆర్మీ జవాన్ మాట్లాడిన వీడియో ఒకటి.. సామాజిక మధ్యమాల్లో వైరల్​గా మారింది. తన భార్యను కొందరు వ్యక్తులు అర్ధనగ్నంగా చేసి, దారుణంగా కొట్టారని ఆ జవాన్​ చెబుతున్న వీడియో.. ట్విట్టర్‌లో ప్రత్యక్షమైంది. ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

army-jawan-wife-stripped-half-naked-beaten-by-120-men-in-tamil-nadu-twitter-video
అర్మీ జవాన్ భార్యపై 120 మంది దాడి
author img

By

Published : Jun 11, 2023, 3:06 PM IST

Updated : Jun 11, 2023, 3:12 PM IST

తమిళనాడులోని నాగపట్నం జిల్లాకు చెందిన ఓ ఆర్మీ జవాన్ మాట్లాడిన వీడియో ఒకటి.. సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. తన భార్యను కొందరు వ్యక్తులు అర్ధనగ్నంగా చేసి, దారుణంగా కొట్టారని ఆ జవాన్​ చెబుతున్న వీడియో.. ట్విట్టర్‌లో ప్రత్యక్షమైంది. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ఎన్​. త్యాగరాజన్​.. ట్విట్టర్​లో ఈ​ వీడియో పోస్ట్​ చేశారు.

కడవాసల్ గ్రామానికి చెందిన ప్రభాకరన్​ అనే ఆర్మీ జవాన్.. జమ్ముకశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. తన భార్యపై దాడి జరిగిందనే విషయాన్ని ఆయన ఓ వీడియో ద్వారా వివరించారు. "నా భార్య కొంత స్థలాన్ని లీజ్​కు తీసుకుని ఓ షాప్​ నడిపిస్తోంది. ఆమెపై 120 మంది పురుషులు దాడి చేశారు. షాప్​లోని సామానంతా కిందపడేశారు. నా కుటుంబాన్ని కత్తులతో బెదిరించారు. నా భార్యను అర్ధనగ్నంగా చేసి దారుణంగా కొట్టారు. నేను జిల్లా ఎస్​పీకి, డీజీపీకి ఓ పిటిషన్ పంపించాను." అని ఆ వీడియోలో ప్రభాకరన్​ చెబుతారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ వీడియోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమార్ అనే వ్యక్తికి చెందిన ఓ షాపును.. ప్రభాకరన్ మామ అయిన సెల్వమూర్తి ఐదేళ్ల పాటు లీజుకు తీసుకున్నాడు. ఫిబ్రవరి 10న రూ. 9.5 లక్షలకు ఈ ఒప్పందం కుదిరింది. లీజ్​కు తీసుకున్న ఈ షాపు.. రేణుగాంబాల్ ఆలయానికి చెందిన స్థలంలో ఉంది. కాగా ఈ మధ్యకాలంలోనే కుమార్ చనిపోయాడు. దీంతో అతని కుమారుడైన రాము.. షాప్​ను తిరిగి ఇచ్చేయాలని సెల్వమూర్తిపై ఒత్తిడి తీసుకువస్తున్నాడు. డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని, షాప్​ను ఖాళీ చేయాలని బెదిరిస్తున్నాడు.

ఈ గొడవను చూసిన కొంతమంది రాముకు మద్దతుగా నిలిచారని పోలీసులు చెబుతున్నారు. వారెవరూ ప్రభాకరన్ కుటుంబ సభ్యులపై దాడి చేయలేదని అంటున్నారు. తరువాత ఇది పెద్ద గొడవకు దారితీసిందని.. షాప్​లో సామాను మొత్తం బయటకు విసిరేసేంత వరకు వెళ్లిందని పోలీసులు పేర్కొన్నారు. ఆ సమయంలో షాప్​లో ప్రభాకర్​ భార్య, అత్త మాత్రమే ఉన్నారని వారు వివరించారు. ఆ తరువాత ప్రభాకరన్ భార్య ఆసుపత్రిలో చేరిందని వెల్లడించారు.

తన భార్య తీవ్రంగా గాయపడిందని తెలిపిన ప్రభాకరన్​.. పోలీసులు తన వాదనలను కొట్టిపారేశారని పేర్కొన్నారు. కాగా తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు.. కె అన్నామలై ఆర్మీ జవాన్​తో మాట్లాడారు. ఈ విషయంలో జవాన్ కుటుంబానికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. వారికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు.

నాపై కత్తితో దాడి జరిగింది: రాము
డబ్బును తిరిగి తీసుకునేందుకు సెల్వమూర్తి తిరస్కరించాడని రాము తెలిపాడు. దుకాణాన్ని ఖాళీ చేసేందుకు అతడు నిరాకరించాడని పేర్కొన్నాడు. కాగా జూన్​ 10న తాను సెల్వమూర్తి కొడుకులైన జీవా, ఉదయకు డబ్బులు తిరిగి ఇచ్చేందుకు.. షాప్​ వద్దకు వెళ్లానని రాము వివరించాడు. కానీ జీవా తనపై కత్తితో దాడి చేశాడని అతడు ఆరోపించాడు.

Last Updated : Jun 11, 2023, 3:12 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.