ETV Bharat / bharat

వైభవంగా పెళ్లి వేడుక.. కాల్పులు మిస్​ఫైర్​.. జవాను మృతి

వైభవంగా జరుగుతున్న ఆ వివాహ వేడుకలో ఆనందంతో కొందరు జరిపిన కాల్పులు విషాదానికి దారితీశాయి. అవి మిస్​ఫైర్​ అవ్వడం వల్ల ఓ ఆర్మీ జవాను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని సోన్​భద్రలో జరిగింది.

army jawan died in harsh firing in sonbhadra pistol missing

author img

By

Published : Jun 22, 2022, 12:15 PM IST

Jawan Killed In Marriage Firing: ఉత్తర్​ప్రదేశ్​లోని సోన్​భద్రలో జరిగిన ఓ వివాహ వేడుకలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లి జరుగుతుండగా కొందరు అతిథులు ఆనందంతో కాల్పులు జరిపారు. అవి కాస్త మిస్​ఫైర్​ అయ్యాయి. దీంతో వివాహానికి హాజరైన ఓ ఆర్మీ జవాను మరణించాడు. మృతుడ్ని దయారామ్​ యాదవ్​గా పోలీసులు గుర్తించారు.

ఇదీ జరిగింది.. సోన్​భద్రలో ఓ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఆ వివాహానికి రవాస్​గంజ్​ కొత్వాలి ప్రాంతానికి చెందిన బాబులాల్​ యాదవ్​ కుమారుడు దయారామ్​ యాదవ్​ వచ్చాడు. జవానుగా విధులు నిర్వహిస్తున్న అతడు.. ఇటీవలే సెలవు మీద ఊరికి వచ్చాడు. అయితే ఆ పెళ్లిలో అకస్మాత్తుగా కొందరు కాల్పులు జరిపారు. అవి కాస్త మిస్​ఫైర్​​ అయ్యి దయారామ్​ను తాకాయి.

దయారామ్​ను స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు. పోలీసుల భయంతో వారు మృతదేహాన్ని అక్కడే వదిలి వెళ్లిపోయారు. వైద్యుడి సమాచారం మేరకు పోలీసులు జిల్లా ఆసుపత్రికి చేరుకున్నారు. జవాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ఇవీ చదవండి: మనుషుల్ని చంపి.. మామిడి చెట్టెక్కి నిద్రిస్తున్న చిరుత.. భయంభయంగా జనం

అసోంకు 'మహా' రాజకీయం.. శిందేతో 40 మంది ఎమ్మెల్యేలు.. ఉద్ధవ్ సర్కార్ పతనమేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.