జమ్ముకశ్మీర్లో నియంత్రణ రేఖ వద్ద భద్రతపై ఆర్మీ చీఫ్ జనరల్ ఎమ్ఎమ్ నరవాణే సమీక్షించారు. ఆ ప్రాంతంలో రెండు రోజుల పాటు పర్యటించి భద్రతా పరిస్థితులను పరిశీలించారని ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు .
పర్యటనలో భాగంగా నగ్రోతా-16కార్ప్స్( వైట్ నైట్ కార్ప్స్)ను మంగళవారం సందర్శించారని పేర్కొన్నారు. జమ్ము ప్రాతంలోని అక్నూర్, రాజౌరీ, నౌశేరాలోనూ పర్యటించారు.
ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషీ, వైట్ నైట్ కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ సుచేంద్ర కుమార్ను ఆర్మీ చీఫ్ జనరల్ ఎమ్ఎమ్ నరవాణే కలిశారు. అక్కడి కరోనా పరిస్థితి గురించి ఆరా తీశారు.
ఇదీ చదవండి: 'కరోనా రోగుల కోసం తాత్కాలిక సైనిక ఆస్పత్రుల ఏర్పాటు'