ETV Bharat / bharat

Army Chief:'ఉగ్ర ఏరివేతను ఆపేస్తున్నట్లు కాదు' - భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందం

జమ్ముకశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి మూడు నెలలుగా శాంతి పరిస్థితులు నెలకొన్నాయని భారత సైన్యాధిపతి(Army Chief) ఎమ్ ఎమ్ నరవాణే అన్నారు. భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందం(Ceasefire) వల్లే ఇది సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. కానీ, జమ్ములో ఉగ్ర ఏరివేత చర్య కొనసాగుతుందని స్పష్టం చేశారు.

MM Narawane
ఎమ్ ఎమ్ నరవాణే, భారత సైన్యాధికారి
author img

By

Published : May 29, 2021, 6:00 PM IST

భారత్​-పాకిస్థాన్​ సైన్యం మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం(Ceasefire) వల్ల మూడు నెలలుగా సరిహద్దుల్లో శాంతి నెలకొందని భారత సైన్యాధిపతి​(Army Chief) ఎమ్​ ఎమ్​ నరవాణే అన్నారు. ఇరు దేశాల నిర్ణయం వల్ల జమ్ము కశ్మీర్​లోని నియంత్రణ రేఖ(LOC) వెంబడి యథాతథస్థితి నెలకొందని అభిప్రాయపడ్డారు. భారత్​-పాక్ సత్సంబంధాలు మెరుగుపడేందుకు ఇది మొదటి అడుగు అవుతుందని పేర్కొన్నారు.

"నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ అనగానే.. భారత్ ఉగ్ర ఏరివేత చర్యను ఆపేస్తుందని కాదు. సరిహద్దుల వెంబడి ఉగ్ర సంస్థల క్యాంప్​లను పాకిస్థాన్​ ఆర్మీ ధ్వంసం చేసినట్లు ఎక్కడా రుజువు కాలేదు. అది వారి అసమర్థత లేదా అయిష్టం అయింటుంది. కానీ, ఇది మాకు ఆలోచించాల్సిన విషయమే."

- ఎమ్​ ఎమ్​ నరవాణే, ఆర్మీ చీఫ్

భారత్​-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటి నుంచి సైన్యం పరస్పరం కాల్పులు జరపలేదని నరవాణే హర్షం వ్యక్తం చేశారు. అయితే.. కొంతమంది సరిహద్దుల్లో చొరబాటుకు యత్నించారని గుర్తుచేశారు. ఉగ్రదాడులు ఇలాగే తగ్గుముఖం పడితే పాక్​తో సంబంధాలు మెరుగు పడొచ్చని అన్నారు. స్థానిక యువత ఉగ్ర సంస్థల్లో చేరే ప్రయత్నాలు కూడా చాలా వరకు తగ్గాయని తెలిపారు. జమ్ముకశ్మీర్​ యువత డ్రగ్స్​ మాఫియా, ఘర్షణల్లో భాగమవకుండా చూస్తామని అన్నారు.

ఇదీ చదవండి:బ్లాక్‌, వైట్‌, ఎల్లో ఫంగస్‌ సోకిన తొలి రోగి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.