Arms supply to terrorists: పాకిస్థాన్ మద్దతుతో పనిచేస్తున్న ఉగ్ర సంస్థల కోసం ఆయుధాలు సరఫరా చేస్తున్న దేశంలోని కీలక వ్యక్తుల కోసం జాతీయ దర్యాప్తు ఏజెన్సీ(ఎన్ఐఏ) వేట ముమ్మరం చేసింది. ఈ విషయంలో సంబంధం ఉందని భావిస్తున్న వ్యక్తుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది. నిందితులను పట్టుకునేందుకు పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్ఐఏ అధికారి ఈటీవీ భారత్‌తో తెలిపారు. బిహార్ నుంచి జమ్ము కశ్మీర్‌కు ఆయుధాలు తరలించేందుకు కుట్ర పన్నిన నలుగురిని అదుపులోకి తీసుకొని విచారించిన అనంతరం.. సోదాలు ముమ్మరం చేసినట్లు చెప్పారు.
NIA arms supply Pak terrorists
ఈ నలుగురు నిందితులను మహమ్మద్ అర్మాన్ అలీ అలియాస్ అర్మాన్ మన్సూరీ, మహమ్మద్ ఎహసానుల్లా అలియాస్ గుడ్డు, ఇమ్రాన్ అహ్మద్ హజామ్, ఇర్ఫాన్ అహ్మద్ దార్లుగా గుర్తించారు. పంజాబ్, హరియాణా మీదుగా ఆయుధాలను తరలించాలని వీరు ప్రయత్నించారు. ఈ ఆయుధాలను పాక్ ప్రోద్బలంతో పనిచేసే ఉగ్రసంస్థల కోసం తీసుకెళ్తున్నారని అధికారులు తెలిపారు.
"పంజాబ్, హరియాణాతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు చెందినవారు ఈ అక్రమ రవాణాలో పాల్గొంటున్నారు. చాలా మందికి ఈ వ్యవహారంతో ప్రత్యక్షంగా సంబంధం ఉందని భావిస్తున్నాం. జైషే మహమ్మద్ అనుబంధ సంస్థ అయిన లష్కరే ముస్తఫా(ఎల్ఈఎం) దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల నుంచి ఆయుధాలను సేకరిస్తోంది. పాక్ సరిహద్దుతో పాటు జమ్ము కశ్మీర్లో భద్రతను కట్టుదిట్టం చేసినందున.. ఉగ్ర సంస్థలు ఇలా ఇతర మార్గాల్లో ఆయుధాలను సమీకరించుకుంటున్నాయి. జమ్ము కశ్మీర్‌తో పాటు దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించేందుకు ఎల్ఈఎం ప్రయత్నిస్తోంది."
-ఈటీవీ భారత్‌తో ఎన్ఐఏ అధికారి
2019లో పుల్వామా దాడి తర్వాత జైషే మహమ్మద్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి నెలకొనడం వల్ల.. భద్రతా దళాల నుంచి తప్పించుకొనేందుకు ఎల్ఈఎంను ఏర్పాటు చేశారని ఎన్ఐఏ గుర్తించింది. బిహార్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, జమ్ము కశ్మీర్‌కు చెందిన వ్యక్తులను ఆయుధాల స్మగ్లింగ్ కోసం చేర్చుకుంటున్నారని తెలిపింది.
ఇదీ చదవండి: సూపర్ మార్కెట్లో 'గొడ్డలి'తో వీరంగం.. రెండు చాక్లెట్లతో పరార్!