ఒడిశా మల్కన్‌గిరి జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. మథిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోలియా ప్రాంతంలో ఓ కాంట్రాక్టర్‌ను అత్యంత దారుణంగా హత్య చేశారు. బాధితుడిని సుకుమార్ మండల్‌గా గుర్తించారు.
సుమారు 15 నుంచి 20 మంది సాయుధ మావోయిస్టులు కాంట్రాక్టర్‌ను అపహరించి తీవ్రంగా కొట్టినట్లు సమాచారం. అనంతరం గొడ్డలితో నరికి చంపినట్లు తెలిసింది.
కాంట్రాక్టర్‌కు చెందిన ఎస్యూవీ, ట్రాక్టర్ సహా మరో వాహనానికి నిప్పుపెట్టారు.
![Maoists in Odisha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/od-mkg-158-contractor-murder-by-naxal-avo-od10013_17122020134305_1712f_1608192785_630.jpg)
ఇదీ చూడండి:రైతుల దుస్థితిపై సుప్రీం సానుభూతి