ETV Bharat / bharat

'బెయిర్​స్టో డబ్బుల కోసమే ఆడతాడు'.. డిక్వెల్లా స్లెడ్జింగ్​ - శ్రీలంక

టిమ్​పైన్-అశ్విన్ స్లెడ్జింగ్​ ఘటన మరవకముందే మరో ఘటన తెరపైకి వచ్చింది. శ్రీలంక పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్​ క్రికెటర్లు జానీ బెయిర్​స్టో, సిబ్లేలపై లంక వికెట్​కీపర్ డిక్వెల్లా నోరు పారేసుకున్నాడు.

'Are you opening in India' to 'playing IPL for cash,' Sri Lankan player takes ugly dig at Dom Sibley, Jonny Bairstow
'అతడు డబ్బులకోసమే ఆడతాడు'.. డిక్వెలా స్లెడ్జింగ్​
author img

By

Published : Jan 26, 2021, 5:30 AM IST

Updated : Jan 26, 2021, 6:51 AM IST

ఇంగ్లాండ్​ క్రికెటర్లు జానీ బెయిర్​స్టో, డొమినిక్​ సిబ్లేలపై స్లెడ్జింగ్​కు దిగాడు శ్రీలంక వికెట్​కీపర్​ నిరోషన్ డిక్వెల్లా. రెండో టెస్టులో ఇంగ్లీష్​ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతడు నిర్విరామంగా స్లెడ్జ్​ చేస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో 'డబ్బుల కోసమే నువ్వు బ్యాటింగ్,​ క్రికెట్ ఆడతావు' అంటూ బెయిర్​స్టోను ఎద్దేవా చేశాడు డిక్వెల్లా.

వచ్చే నెల నుంచి భారత్​లో ఇంగ్లాండ్​ పర్యటించనుంది. తొలి రెండు టెస్టులకు బెయిర్​స్టోకు విశ్రాంతినిచ్చారు. మరోవైపు వచ్చే ఐపీఎల్​ కోసం సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టు అతడిని అట్టిపెట్టుకుంది. దీంతో 'భారత్ పర్యటన నుంచి తప్పుకున్నాడు. కానీ ఐపీఎల్​ ఆడతాడు. డబ్బుల కోసమే ఇతడు ఆడతాడు' అని బెయిర్​స్టోపై వ్యాఖ్యలు చేశాడు లంక ఆటగాడు.

ఈ మాటల ప్రభావం బెయిర్​స్టోపై పడినట్లుగానే ఉంది. ఆ వెంటనే స్లిప్​లో ఉన్న క్రికెటర్​కి క్యాచ్​ ఇచ్చి పెవిలియన్​ చేరాడు.

ఇక ఆఖరి ఇన్నింగ్స్​లో సిబ్లే జాగ్రత్తగా బ్యాటింగ్​ చేస్తున్న సమయంలో.. అతడిని 'భారత పర్యటనలో నీకు జట్టులో చోటుంటుందా?' అని కవ్వించబోయాడు డిక్వెల్లా. అయితే హుందాగా బదులిచ్చాడు సిబ్లే. 'శ్రీలంకలో బ్యాటుకు పెద్దగా పని చెప్పాల్సిరానందున జట్టులో చోటు గురించి కచ్చితంగా చెప్పలేను' అని అన్నాడు.

చివర్లో డిక్వెల్లాకు స్వీట్​ వార్నింగ్​ ఇచ్చింది ఇంగ్లాండ్​ జట్టు. జాగ్రత్తగా బ్యాటింగ్ చేయమని, లేదంటే జట్టు నుంచి తొలగించి కీపింగ్​ బాధ్యతలు దినేశ్ చండీమల్​కు ఇస్తారని హెచ్చరించింది.

ఇక శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ను ఇంగ్లాండ్​ క్లీన్​స్వీప్​ చేసింది. సిరీస్​ను 2-0 తేడాతో చేజిక్కించుకుంది.

ఇదీ చూడండి: ఆస్ట్రేలియా కెప్టెన్​కు అశ్విన్​ స్వీట్​ వార్నింగ్​!

Last Updated : Jan 26, 2021, 6:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.