ETV Bharat / bharat

డేంజర్ న్యూస్ : ఫోన్ వెనక డబ్బులు దాస్తున్నారా? - అది మీ ప్రాణాలకే ప్రమాదం!

Currency in Mobile Pouch : మీకు మొబైల్ పౌచ్​లో కరెన్సీ నోట్లు దాచుకునే అలవాటు ఉందా? అయితే మీకో బిగ్ అలర్ట్. ఇలా చేయడం వల్ల మీ ప్రాణానికే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అదెలాగో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే..!

Currency
Currency in Mobile Pouch
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2023, 4:15 PM IST

Currency in Mobile Pouch : మగాళ్లు జేబుల్లో, పర్సులో డబ్బు దాచడం సహజం. ఆడవాళ్లు హ్యాండ్ బ్యాగులో ఉంచుతారు. అయితే.. ఈ మధ్య జనాలు మొబైల్ ఫోన్ పౌచ్​ వెనక డబ్బు దాచుకోవడం కూడా మొదలు పెట్టారు. ఇలా డబ్బు దాచేవారిలో మహిళల సంఖ్యే అధికం. బయటికి వెళ్తే చేతిలో మొబైల్(Mobile) ఉంటుంది కాబట్టి.. ఏదైనా కొనుగోలు చేయాలంటే ఈ డబ్బు ఉపయోగపడుతుందనే భావనతో ఇలా చేస్తుంటారు. కానీ.. అలా ఫోన్ వెనుక డబ్బులు దాచుకోవడం డేంజర్ అని మీకు తెలుసా? కొన్నిసార్లు ప్రాణాలు పోయేంత ప్రమాదం ఉంటుందట! మరి.. అంత ఉపద్రవం ఎలా వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Risk for Hide of Currency in Mobile Pouch : ఈ రోజుల్లో సెల్​ఫోన్ లేకుండా క్షణం కూడా ఉండలేని పరిస్థితి. పొద్దున లేచింది మొదలు.. అర్ధరాత్రి పడుకునే సమయం వరకు ఫోన్ వాడుతూనే ఉంటారు. ఇలా ఎక్కువగా వాడుతున్నప్పుడు లేదా ఛార్జింగ్ పెట్టినప్పుడు.. ఫోన్ ఒక్కోసారి వేడెక్కడం మీరు గమనించే ఉంటారు. అప్పుడు ఆ ప్రభావం కనిపించేది మొబైల్ వెనుక వైపే కదా! కాబట్టి అలాంటప్పుడు మీ ఫోన్ వెనుక వైపు కరెన్సీ, క్రెడిట్ కార్డులు, షాపింగ్ బిల్లులు వంటివి ఉంటే.. వేడి తీవ్రమై మంటలు చెలరేగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. కరెన్సీ తయారు చేయడానికి కాగితంలోపాటు అనేక రకాల రసాయనాలను వినియోగిస్తారు. ఆ రసాయనాలు మంటలను వేగంగా ఆకర్షిస్తాయి. తద్వారా.. ఒక్కోసారి పేలుళ్లూ సంభవించి ప్రాణాలు పోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

పాచ్​ల విషయంలో ఆ జాగ్రత్తలు తప్పనిసరి : క్రెడిట్, డెబిట్ కార్డుల వంటి పెట్టడం వల్ల కూడా పలు సమస్యలు వస్తాయి. వీటి మీద మాగ్నెటిక్ స్ట్రిప్స్ ఉంటాయి. వీటిని ఫోన్ వెనక పెట్టడం వల్ల అవి డీమాగ్నటైజ్ అవుతాయి. దీంతో కార్డులు పని చేయకుండా పోయే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి కార్డులు కూడా మొబైల్ వెనుక పెట్టకపోవడం మంచిది.

ఇక, ఫోన్‌ రక్షణ కోసమని కొందరు.. ఆకర్షణీయంగా ఉండాలని మరికొందరు.. రకరకాల పౌచ్​లను వాడుతుంటారు. అయితే.. అవి మరీ టైట్​గా ఉండకుండా చూసుకోవాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే అవి బిగుతుగా ఉంటే ఫోన్ నుంచి వెలువడే వేడి బయటకు పోదు. దాంతో ఒత్తిడి పెరిగి మొబైళ్లు పేలే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, వీలైనంత వరకూ మొబైల్ వెనుక భాగం పూర్తిగా కప్పేయకుండా చూసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

స్మార్ట్‌ ఫోన్లు వేడెక్కుతున్నాయా? ఈ టిప్స్​ మీ కోసమే..

ఇవే కాదు వ్యక్తిగతంగానూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమే. ముఖ్యంగా ఆన్​లైన్​ గేమ్స్, సోషల్ మీడియా అంటూ మొబైళ్లను తెగ వాడేస్తుంటారు. ఈ వాడకం పెరిగే కొద్దీ దానిలోని ప్రాసెసర్‌ వేడిని మరింత ఉత్పత్తి చేస్తుంది. అయినా మొబైల్ ఉపయోగిస్తోంటే ఆ ప్రభావం మనపైనా పడుతుంది. తలనొప్పి, ఆందోళన, నిద్రలేమి, చెవులు దెబ్బతినడం లాంటి ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి, ఫోన్‌ మాట్లాడేప్పుడు ఇయర్‌ ఫోన్లు వాడటం, కాస్త వేడెక్కగానే పక్కన పెట్టేయడం వంటివి చేయాలి.

వీటితోపాటు మొబైల్​ పౌచ్ వెనక డబ్బులు దాచే అలవాటు ఉంటే.. వెంటనే మానేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌లో ఎవరికైనా ఈ అలవాటు ఉన్నా.. వెంటనే వారికి ఈ విషయం తెలియజేయండి.

Best Smartphone Cleaning Tips : ఈ బెస్ట్ స్మార్ట్​ఫోన్ క్లీనింగ్ టిప్స్ ఫాలో అవ్వండి.. స్క్రీన్, కెమెరా, స్పీకర్ దెబ్బతినకుండా చూసుకోండి.!

మొబైల్​లో ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా?.. ఈ సింపుల్ ట్రిక్స్​ మీకోసమే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.